కీలక పదవికి ఇండియన్ అమెరికన్

Obama nominates Indian-American to key post
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త షమినా సింగ్‌ను పరిపాలనా విభాగంలోని కీలక బాధ్యతను కట్టబెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమె పేరును ప్రతిపాదించారు. నేషనల్, కమ్యూనిటీ సర్వీస్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి షమినా సింగ్‌ను బరాక్ ఒబామా నామినేట్ చేశారు. ఈ మేరకు ఒబామా గురువారం ఒక ప్రకటన చేశారు.

యెమన్‌ దేశంలో అమెరికా రాయబారిగా మాథ్యూ హెచ్ ట్యూల్లర్‌ను నియమిస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా ఒబామా ప్రకటించారు. తమ దేశానికి సేవ చేసేందుకు ప్రతిభ గల వ్యక్తులను పరిపాలనా విభాగంలో నియమిస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని ఒబామా ప్రకటించారు. వారి సహకారంతో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

ఇండియన్ అమెరికన్ లీడర్ షిప్ ఇంక్యూబేటర్ (ఐఏఎల్ఐ) వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్న షమినా సింగ్, మాస్టర్ కార్డ్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా షమినా సింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేగాక ఎంఎస్ఎల్‌జిఆర్ఓయూపికి సీనియర్ అడ్వైజర్‌గా 2011 నుంచి 2013 వరకు పనిచేశారు. నైక్ ప్రభుత్వ, పబ్లిక్ ఏఫైర్ వైస్ ప్రెసిడెంట్ పదవిలో 2010 నుంచి 2011 వరకు కొనసాగారు. సిటీ గ్రూప్ సిఓఓ గ్లోబల్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌లో 2005 నుంచి 2010 వరకు ఆమె సేవలందించారు.

ప్రెసిడెంట్‌కు సంబంధించిన ఏసియన్ అమెరికన్, పసిఫిక్ ఐస్ లాండర్స్‌‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా 1999 నుంచి 2001 వరకు సింగ్ పనిచేశారు. ఈ విధంగా ఆమె అనేక ఉన్నత పదవులలో బాధ్యతలు నిర్వహించి తన సమర్థతను చాటుకున్నారు. ఆమె బ్యాచిలర్ సైన్స్‌ను ఓల్డ్ డోమినియన్ యూనివర్సిటీ నుంచి అందుకున్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్‌ను లిండాన్ బి జాన్సన్ స్కూల్ ఆఫ్ ఏఫైర్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్, ఆస్టిన్ నుంచి పొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+