NRI News: ఆర్మన్ సింగ్ హత్య కేసులో ఐదో నిందితుడు అరెస్ట్..

పశ్చిమ ఇంగ్లండ్‌లో ఓ ముఠా చేసిన మెరుపుదాడిలో 23 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన డెలివరీ బాయ్ ఆర్మన్ మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదోవ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆర్మన్ ను హత్య చేసిన కేసులో ఐదవ వ్యక్తిపై అభియోగాలు మోపినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు 21న ష్రూస్‌బరీలోని బెర్విక్ అవెన్యూలో పార్శిళ్లను డెలివరీ చేస్తుండగా డైనమిక్ పార్శిల్ డిస్ట్రిబ్యూషన్‌లో పనిచేసిన ఆర్మన్ సింగ్ పై కొందరు దుండగులు దాడి చేశారు. దాడిలో ఆర్మన్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

పీటర్‌బరోలోని పేనెల్స్‌కు చెందిన 23 ఏళ్ల సుఖ్‌మన్‌దీప్ సింగ్‌ను ఆగస్టు 31న అరెస్టు చేసినట్లు వెస్ట్ మెర్సియా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అతనిపై సెప్టెంబరు 1న ఆర్మన్ సింగ్ హత్య చేశారని అభియోగాలు మోపారు. మరుసటి రోజు కిడ్డెర్‌మిన్‌స్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. నేరస్థుడికి సహాయం చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను బెయిల్‌పై ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ హత్యంకు పాల్పడిన వారందారు భారత సంతతికి చెందినవారేనని పేర్కొన్నారు.

 Police have arrested the fifth accused in Arman Singh murder case in UK

ఈ హత్యలో స్థానికులు ఎవరు లేరని చెప్పారు. ఈ హత్యకు సంబంధించి టిప్టన్‌కు చెందిన అర్ష్‌దీప్ సింగ్, 24, డడ్లీకి చెందిన జగ్‌దీప్ సింగ్ 22, శివదీప్ సింగ్, 26, మంజోత్ సింగ్, 24, స్మెత్‌విక్‌కు చెందిన 24 ఏళ్లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నలుగురు నిందితులను ఆగస్టు 30న వోల్వర్‌హాంప్టన్ క్రౌన్ కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వారు రిమాండ్‌లో ఉన్నారు. హత్య జరిగిన రోజు ఉదయం 11 గంటల నుంచి ఆ ప్రాంతంలో కారు ఆపివేయడం కనిపించిన తర్వాత కత్తులు, బేస్ బాల్ బ్యాట్‌లు, పారతో ఆయుధాలు ధరించిన వ్యక్తులు కనిపించారని ప్రత్యక్ష సాక్షులు స్థానిక మీడియాకు తెలిపారు.

నిందితులు డబ్బు కోసం హత్య చేయలేదని విచారణ అధికారి అనుమానిస్తున్నారు. ఆర్మన్ కు నిందితులు తెలుసని చెప్పారు. "ఆర్మన్ డెలివరీ వ్యక్తి అని మాకు తెలుసు, అయితే ఈ దశలో అతని మరణానికి ఇదే కారణమని మేము నమ్మడం లేదు. మేము దీనిని దోపిడీగా పరిశోధించడం లేదు. నేరంలో పాల్గొన్న వారికి ఒకరికొకరు తెలుసు " విచారణ అధికారి బెల్లామీ చెప్పారు. "మాకు జరిగినది మరొక కుటుంబానికి జరగాలని మేము కోరుకోము. వారి దర్యాప్తును శ్రద్ధగా నిర్వహించి మద్దతు ఇచ్చినందుకు మేము పోలీసులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము " అని ఆర్మన్ తల్లి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+