విషాదం.. అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లోరిడాలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని టేకులపల్లి వాసులుగా గుర్తించారు. భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. చనిపోయిన వారిని మృతులు ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56)గా చెబుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టేకులపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, ఆయన భార్య మాజీ సర్పంచ్ పవిత్రాదేవికి ఇద్దరు కుమార్తెలున్నారు. రెండో కుమార్తె ప్రగతి రెడ్డికి సిద్దిపేటకు సమీపంలోని బక్రి చెప్యాల చెందిన రోహిత్‌రెడ్డితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రోహిత్‌రెడ్డి తల్లి సునీత కూడా వారితో పాటే అమెరికాలో ఉన్నారు.

అయితే ఈరోజు ప్రగతి రెడ్డి, రోహిత్ రెడ్డి, ఇద్దరు పిల్లలు, సునీత కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రగతిరెడ్డి, పెద్దకుమారుడు అర్విన్, సునీత అక్కడికక్కడే మృతిచెందగా.. రోహిత్ రెడ్డి, చిన్నకుమారుడు గాయాలతో బయటపడ్డట్టు చెబుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ప్రగతిరెడ్డి తల్లిదండ్రులు మోహన్‌రెడ్డి, పవిత్రాదేవి అమెరికాకు బయల్దేరారు. మృతులకు ఫ్లోరిడాలోనే దహన సంస్కారాలు చేస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం పట్ల వారి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వారి స్వగ్రామంలో సైతం విషాదఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications