అమెరికాలో రోడ్డు ప్రమాదం : ఇద్దరు భారతీయుల మృతి, మరొకరికి గాయాలు
వాషింగ్టన్ : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండియానా పోలిస్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో ఇద్దరు ఇండో- అమెరికన్లు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. వరుణ్‌దీప్ బ్రింగ్ (19), దవ్‌నీత్ చాహల్ (22) మృతి చెందగా, గుర్జాత్ ఎస్ సంధూ (20) తీవ్రంగా గాయపడ్డారు.

కబళించిన మృత్యువు ..
ఫిషర్స్ సిటీలో నివాసం ఉండే ... వీరు బయటకు వెళ్తుండగా మృత్యువు కబళించింది. స్పోర్ట్ యుటిలిటి వెహికల్ (ఎస్‌యూవీ) చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. కారు నడుపుతున్న దవ్‌నీత్ సీటు బెల్ట్ పెట్టుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఇండియానాపోలిస్ లోని సిక్కు కమ్యూనిటీ విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారిని ఆపడం ఎవరి తరం కావడం లేదు. అప్పటివరకు తమతో మాట్లాడిన స్నేహితులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోాయారని తెలిసి ఫ్రెండ్స్ బోరున విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై అమెరికా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. వారి కారు చెట్టుకు ఢీ కొని చనిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించామని .. ఇందులో కుట్రకోణం ఏమ లేదని తెలిపారు.












Click it and Unblock the Notifications