వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా దినోత్సవంలో నినా దేవలూరి

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోతవ్సాన్ని పురష్కరించుకుని ‘రీచింగ్ ఫర్ ది స్టార్స్' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని న్యూజెర్సీలోని ఎడిసన్‌లోని రాయల్ అల్బర్ట్ ప్యాలెస్‌లో నిర్వహించనున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా-తానా) నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. వివిధ రంగాల్లో తెలుగు యువత, మహిళలు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిస్ అమెరికా నినా దేవులూరి, గౌరవ అతిథిగా మేరీలాండ్ లెజిస్లేటర్‌గా ఎన్నికైన తొలి తెలుగు మహిళ అరుణా మిల్లర్ హాజరవుతారని తానా నిర్వాహకులు తెలిపారు. 2013 నేషనల్ స్పెల్లింగ్ బి విజేత అరవింద్ మహాంకాళి కూడా హాజరవుతారని చెప్పారు. 2012 అమెరికన్ ఐడల్ సెమీఫైనలిస్ట్, గాయని సుభా వేదుల, స్పేస్ సైంటిస్టులు కావ్య మాన్యపు, శిరీష బండ్ల, న్యూయార్క్ నగర యువ కవి రమ్య రమణ, అలబామా యూనివర్సిటీ కమన్స్ మెంట్ స్పీకర్ స్వప్న కాకానిలు హాజరవుతారని పేర్కొన్నారు.

TANA Celebrates Women and Youth Day

వీరితోపాటు మిడ్ అట్లాంటిక్ ప్రాంతం నుంచి డాక్టర్ తులసి పోలవరపు, డాక్టర్ సునీత కనుమూరి, డాక్టర్ మీరా బొపన్న, డాక్టర్ శాలిని పచ్చ, డాక్టర్ జననీ కృష్ణ, జాణకిరావు, జయప్రద వల్లూరుపల్లి, సరోజ సాగరం, శోభా తుమ్మలు కార్యక్రమానికి హాజరై వారు సాధించిన విజయాలను, తెలుగు కమ్యూనిటీకి అందించిన సేవల గురించి వివరించనున్నారని నిర్వాహకులు తెలిపారు.

మహిళా దినోత్సవం రోజైన మార్చి 8న రోజంతా కూడా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ప్యానెల్ డిస్కషన్స్, టాలెంట్ షో, ఫ్యాషన్ షో కార్యక్రమాలు నిర్వహించబడతాయని చెప్పారు. ఆ రోజు సాయంత్రం యాంకర్ ఝాన్సీ కార్యక్రమాలకు వ్యాఖ్యతగా ఉంటుందని, రామాచారి ఆధ్వర్యంలో సునీత, ప్రణవి, సాకేత్, గీతా మాధురి తమ పాటలతో అలరించనున్నారని తెలిపారు. కమెడియన్ వెంకీ, నటుడు నందూ కూడా ప్రదర్శన ఇస్తారని చెప్పారు.

కార్యక్రమానికి సంబంధించిన ఇతర వివరాల కోసం [email protected], phone # 732-822-2943 సంప్రదించవచ్చని తానా నిర్వాహకులు మోహన్ నన్నపనేని, డాక్టర్ చౌదరి జంపాలా, రవి పొట్లూరిలు తెలిపారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగు యువత, మహిళలు హాజరై విజయం చేయాలని కోరారు.

English summary
We invite your active participation as TANA celebrates the International Women’s Day with a special program for Telugu youth and women, Reaching for the Stars, on Saturday, March 8, 2014 at the Royal Alberts Palace in Edison, NJ.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X