వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తానా సేవా కార్యక్రమాల సమీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

బోస్టన్: ప్టెంబరు 27,28 తేదీలలో ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) పాలకమండలి బోస్టన్ నగరంలో సమావేశమయ్యింది. తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు డా.జంపాల చౌదరి, పాలకమండలి అధ్యక్షుడు నరేన్ కొడాలి, తానా ఫౌండేషన్ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి, తానా కార్యదర్శి సతీష్ వేమన, కోశాధికారి మధు తాతా, పలు ప్రాంతాలనుండి వచ్చిన తానా ప్రాంతీయ ప్రతినిధులు, ఇతర పాలకమండలి సభ్యులు ఈ సమావేశాలలో పాల్గొన్నారు.

అమెరికాలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ తానా చేస్తున్న పలు సేవాకార్యక్రమాలను ఈ సమావేశంలో సమీక్షించి,. భవిష్యత్తులో ఆ కార్యక్రమాలను విస్తృతం చేయటానికి నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికాలో తెలుగువారు ఏ మూల ఉన్న ఉన్నా వారికి తానా చేరువగా, బాసటగా ఉండగల మార్గాల గురించి చర్చించారు. సంస్థ ఆర్థిక పరిస్థితిపై సంతృప్తి వ్యక్తం చేసి, మరింత పటిష్టం చేయడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ సంస్థాగత కమిటీలకు సభ్యులని నియమించారు.

Tana meets to review programmes

విజయవంతంగా 19వ తానా మహాసభలు నిర్వహించిన డాలస్ తెలుగు సంఘం సభ్యులకు, తానా కార్యకర్తలకు, దాతలకు పాలకమండలి కృతజ్ఞత ప్రకటించింది. డెట్రాయిట్‌లో జరగబోయే 20వ తానా మహాసభల సన్నాహాల గురించి సమావేశ సమన్వయకర్త నాదెళ్ళ గంగాధర్ వివరించారు.
అమెరికాలో పేద విద్యార్థులకు సహాయంగా తానా పలు ప్రాంతాలలో రెండు వేలకు పైగా స్కూల్ బ్యాగులను అందించిన సందర్భంగా ఆ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు, విజయవంతంగా నిర్వహించిన తానా ప్రాంతీయ ప్రతినిదికులకు తానా పాలక మండలి అభినందనలు తెలియజేసింది.

రానున్న రెండు నెలల్లో తానా పలు నగరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించంటం ద్వారా తానా చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రాచుర్యం కల్పించాలని కార్యవర్గం నిర్ణయించింది. రోజు రోజుకీ పెరుగుతున్న అమెరికాలోని తెలుగు వారి అత్యవసర సహాయక కార్యక్రమాలకు అనునిత్యం అండగా నిలుస్తూ కనీసం వారానికి రెండు సంఘటనల్లో సహాయాన్ని అందిస్తున్నా గత నాలుగు సంవత్సరాలలో ఎటువంటి వివాదానికీ లోనుకాకుండా సమర్ధవంతంగా నడుస్తున్న టీం స్క్వేర్ కార్యకర్తలకు అభ్హినందనలు తెలియజేసింది.
27 వ తేదీ (శనివారం) సాయంత్రం నన్నపనేని మోహన్ తానా పాలకమండలి సభ్యులకు, బోస్టన్ తెలుగు సంఘం ప్రతినిధులకు విందు ఏర్పాటు చేశారు. తమకు చక్కటి ఆతిథ్యమిచ్చిన బోస్టన్ తెలుగువారికి తానా పాలకమండలి కృతజ్ఞతలు వ్యక్తం చేసింది.

English summary

 TANA has reviewed its programmes takenup for the community development in USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X