NRI News: లండన్‍లో హత్యకు గురైన తెలుగు యువతి.. బ్రెజిల్ యువకుడు ఎందుకు దాడి చేశాడంటే..!
లండన్ లో తెలంగాణకు చెందిన యువతి హత్యకు గురయింది. బ్రెజిల్ కు చెందిన ఓ యువకుడు ఆమె పై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని తల్లితండ్రులు హైదరాబాద్ లోని చంపాపేటలో స్థిరపడ్డారు.
తేజస్విని పై చదువుల కోసం లండన్ వెళ్లింది. అక్కడ ఆమె స్నేహితులతో కలిసి ఓ అపార్ట్ మెంట్ లో ఉంటూ చదువుకుంటోంది. తేజస్విని, అఖిల అనే విద్యార్థినిలపై బ్రెజిల్ కు చెందిన యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తేజస్విని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెంది.

మరో యువతి అఖిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆ యువకుడు వీరి వద్ద ఎందుకు వచ్చాడు. ఎందుకు దాడి చేశాడు అనే కోణమంలో విచారిస్తున్నారు. ప్రస్తుతం నిందితు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
తేజస్విని ప్రస్తుతం లండన్ లో ఎమ్మెస్ చేస్తోంది. తన తండ్రికి అనారోగ్యం ఉంటే 6 నెలల క్రితమే తేజస్విని ఇంటికి వచ్చి వెళ్లింది. తేజస్విని చదువు 2 నెలలో ముగిసేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరణ వార్త విన్న ఆమె తల్లిదండ్రులు బోరున విలిపిస్తున్నారు. తేజస్విని మృదేహాన్ని హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications