NRI News: అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ విద్యార్థి మృతి..
అమెరికాలో కాల్పుల ఘటనలు నిత్యకృత్యం అయిపోయాయి. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో భారతీయుడు చనిపోయాడు. యూఎస్ లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడిని విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన రాఘవులు, రమాదేవి దంపతుల కుమారుడు ప్రవీణ్ మిల్వాకీలోని ఒక విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చదువుతున్నాడు.
ప్రస్తుతం మాస్టర్స్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. ఖర్చుల కోసం అక్కడే ఒక స్టార్ హోటల్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రవీణ్ బస చేసిన ప్రదేశానికి సమీపంలోని బీచ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పుల జరిగిన వెంటనే.. అతను కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశాడు.

ఈ సంఘటన గురించి ప్రవీణ్ కుటుంబానికి అతని స్నేహితులు సమాచారం అందించడంతో అతని గ్రామంలో విషాద ఛాయలు నెలకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గతంలో కూడా భారతీయ విద్యార్థులు కాల్పుల్లో మరణించిన ఘటనలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications