NRI News: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి హత్య..!

అమెరికాలో భారతీయ విద్యార్థుల హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నీల్ ఆచార్య అనే భారతీయ విద్యార్థి కూడా హత్యకు గురయ్యాడు. ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీలో నీల్ ఆచార్య చదువుతున్నాడు. అతను ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. నీల్ ఆచార్య కనిపించకపోవడంతో అతని తల్లి ట్విట్టర్(ఎక్స్)లో ట్వీట్ చేశారు. "మా అబ్బాయి నీల్ ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. నా కొడుకు పర్డ్యూ యూనివర్సిటీలో చదుపుతున్నాడు. మీకే ఏమైనా సమాచారం తెలిస్తే చెప్పండి" అంటూ ట్వీట్ చేశారు.

నీలా అచార్యను ఉబ్ డ్రైవర్ చివరి సారిగా చూసినట్లు ఆమె చెప్పారు. చికాగోలోని కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమె ట్వీట్ పై స్పందించారు. కాన్సులెట్ యూనివర్సిటీ అధికారులతో మాట్లాడారు. వెస్ట్ లఫాయెట్‌లోని 500 అల్లిసన్ రోడ్‌లో నీల్ ఆచార్య శవమై కనిపించాడు. నీల్ మరణించినట్లు పర్డ్యూ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి క్రిస్ క్లిఫ్టన్ స్పష్టం చేశారు. నీల్ ఆచార్య హత్యపై స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది.

The death of Indian students in America is causing a stir

గత 10 రోజుల్లో ఇద్దరు భారతీయ విద్యార్థులు చనిపోవడం కూడా సంచలనం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం జార్జియాలోని లిథోనియాలో మరో భారతీయ విద్యార్థి వివేక్ సైనీపై దారుణంగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు. 25 ఏళ్ల వివేక్ ఇటీవల ఎంబీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. మాదకద్రవ్యాలకు బానిస అయిన జూలియన్ ఫాల్క్‌నర్ వివేక్ దాడి చేసి హత్య చేశాడు.

పార్ట్ టైమ్ క్లర్క్‌గా పనిచేస్తున సైనీపై ఫాల్క్‌నర్ దాడి చేశాడు. తలపై సుత్తితో దాదాపు 50 సార్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి. అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ సంఘటనపై తమ బాధను వ్యక్తం చేసింది. భారత జాతీయ/విద్యార్థి వివేక్ సైనీ మరణానికి దారితీసిన భయానక, క్రూరమైన, హేయమైన సంఘటనతో తాము తీవ్రంగా వేదన చెందామని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+