వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు ప్రొఫెసర్లకు అవార్డులు ప్రకటించిన ఎన్నారై గ్రూప్

|
Google Oneindia TeluguNews

Two Indian-Origin US Professors to be Honoured by NRI Group
వాషింగ్టన్: తమ తమ రంగాల్లో పరిశోధనలు చేయడంతోపాటు ఉత్తమంగా రాణించిన భారత సంతతికి చెందిన ఇద్దరు కెమెస్ట్రీ, బయో కెమెస్ట్రీ ఫ్రొఫెసర్లను గౌరవించనున్నట్లు ఎన్నారై వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. వీరిద్దరూ టెక్సాస్ యూనివర్సిటీ(అర్లింగ్టన్)లో ప్రొఫెసర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.

కెమెస్ట్రీ, బయో కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ సుభ్రంగ్షు మండల్‌కి మహాత్మాగాంధీ ప్రవాసీ సమ్మాన్ అవార్డు, కెమిస్ట్రీ, బయో కెమెస్ట్రీ ప్రొఫెసర్ కృష్ణన్ రాజేశ్వర్‌కు హింద్ రతన్ అవార్డును బహూకరించనున్నట్లు వెల్లడించింది. ఈ అవార్డులు విదేశాల్లో భారత జాతి కీర్తి ప్రఖ్యాతలు చాటినందుకు ఇస్తున్నట్లు ఎన్నారై అసోసియేషన్ పేర్కొంది. ఈ అవార్డులను అక్టోబర్‌లో లండన్‌లో జరుగనున్న ఎన్నారై వెల్ఫేర్ సొసైటీ కాన్ఫరెన్స్ సందర్భంగా మండల్‌కు, ఇండియాలో జరుగనున్న కాన్ఫరెన్స్‌లో రాజేశ్వర్‌కు అందజేయనున్నట్లు తెలిపింది.

డాక్టర్ రాజేశ్వర్, డాక్టర్ మండల్‌లు తమ యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారని, వారి సేవలు అమూల్యమని, తమ వర్సిటీ విద్యార్థుల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దడంలో వీరి పాత్ర, పరిశోధనలు అమోఘమని యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్, ప్రోవోస్ట్ రోనాల్డ్ ఎల్సన్బూమర్ అన్నారు.

తాము చేసిన కృషి భారతీయులు విదేశాల్లో మరింత రాణించేందుకు దోహదపడుతుందని, తమను సత్కరించాలని ఎన్నారై అసోసియేషన్ భావిస్తుండటం తనకు ఎంతో ఆనందంగా ఉందని, వారికి కృతజ్ఞతలని రాజేశ్వర్ తెలిపారు. ఎన్నారై వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి అవార్డును అందుకోనుండటం ఎంతో గౌరవంగా ఉందని మరో ప్రొఫెసర్ మండల్ అన్నారు. మండల్ 2005లో నుంచి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

English summary

 For their contributions in the fields of chemistry and biochemistry, two Indian-origin professors from the University of Texas, Arlington would be honoured by the Non-Resident India (NRI) Welfare Society of India, the India-based association said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X