Oscars 2022: హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ భార్యకు ఆ వ్యాధి: ఆమె జుట్టుపై కమేడియన్ కామెంట్
వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మకమైన 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్.. కమేడియన్ క్రిస్ రాక్‌పై చేయి చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఓ అంతర్జాతీయ వేదిక మీద, తోటి నటీనటులు, నామినీల మధ్య అతను క్రిస్ రాక్‌పై దాడి చేయడానికి కారణాలేమిటనే విషయంపై ఆరా తీస్తోన్నారంతా. విల్ స్మిత్ భార్య జేడ్ పింకెట్ స్మిత్‌పై వేసిన జోక్ అతని ఆగ్రహానికి కారణమైందనేది తెలిసిన విషయమే.
Recommended Video

అయినప్పటికీ.. అందరి ముందూ క్రిస్ రాక చెంప పగులగొట్టేంతగా విల్ స్మిత్ ఫైర్ కావడం వెనుక మరో కోణం ఉంది. నిజానికి- జేడ్ పింకెట్ స్మిత్ జట్టు రాలిపోయే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి పేరు అలొపెసియా ఎరియాట (Alopecia Areata). చాలాకాలంగా ఆమె ఈ జబ్బుతో సతమతమౌతున్నారు. అందుకే ఎప్పుడూ క్లీన్ హెడ్ షేవ్‌తో కనిపిస్తుంటారు. తాను ఈ వ్యాధి బారిన పడినట్టు జేడ్ పింకెట్ స్వయంగా వెల్లడించారు. 2018లో ఆమె తొలిసారిగా క్లీన్ హెడ్ షేవ్‌తో బాహ్య ప్రపంచం ముందుకొచ్చారు.
జుట్టు రాలడానికి కారణం అయ్యే జబ్బు ఇది. ఈ జబ్బు సోకినవారి జుట్టు రాలిపోతుంటుంది. సాధారణ పరిభాషలో చెప్పుకోవాలంటే ఈ జబ్బును పేను కొరుకుడు అని అనొచ్చు. పేను కొరుకుడు బారిన పడిన వారికి ఇతర అనారోగ్యకర లక్షణాలేవీ ఉండవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. జుట్టు రాలిపోవడాన్ని మాత్రం అరికట్టలేరు. ఇప్పుడు విల్ స్మిత్ భార్య- ఈ జబ్బుతోనే బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు కూడా.

తాను తల స్నానం చేస్తున్నప్పుడంతా జుట్టు విపరీతంగా రాలిపోతుండేదని ఆమె అప్పట్లో చెప్పుకొచ్చారు. అందుకే ఆ ఇబ్బందేమీ లేకుండా ఉండటానికి క్లీన్ హెడ్ షేవ్ చేసుకుంటున్నానని తేల్చి చెప్పారు. ఇవ్వాళ లాస్ ఏంజిలిస్‌లోని డాల్బీ థియేటర్‌లో ఏర్పాటైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో సరిగ్గా ఈ పాయింట్ మీదే కమేడియన్ క్రిస్ రాక్.. జోక్ వేయడంతో విల్ స్మిత్ ఆగలేకపోయాడు. అందరి ముందూ అతని ముఖంపై పంచ్ ఇచ్చాడు.
ఈ సంవత్సరం బెస్ట్ యాక్టర్ ఆస్కార్ అవార్డ్ హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్‌ను వరించింది. కింగ్ రిచర్డ్ సినిమాలోని నటనకు అతనికి ఈ అవార్డు లభించింది. అమెరికన్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. రెనాల్డో మార్కస్ గ్రీన్ దర్శకుడు. టెన్నిస్ ప్రపంచానికి సెరెనా విలియమ్స్, ఆమె సోదరి వీనస్ విలియమ్స్‌ను అందించిన వారి తండ్రి కమ్ కోచ్ రిచర్డ్ విలియమ్స్.. జీవితం ఆధారంగా దీన్ని తెర కెక్కించారు. ఆయన పేరే ఈ మూవీకి పెట్టారు. టైటిల్ రోల్‌లో నటించాడు విల్ స్మిత్. ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించాడు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications