సెక్స్ రాకెట్ నడుపుతున్న మహిళా సూత్రధారి అరెస్టు

గున్నాబాయి బారిన పడిన ఓ బాధితురాలు నజిమా ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నిఘా విభాగం పోలీసులు హైదరాబాదులోని పాతబస్తీలో గల ఫలక్‌నుమా ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. సెక్స్ రాకెట్ ముఠా నుంచి తప్పించుకున్న నజీమా అనే అమ్మాయి రెండున్నర నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిజామాబాద్‌లోని నామ్‌దేవ్ వాడలో క్యాటరింగ్ సెంటర్ నడుపుతూ గున్నాబాయి అందమైన అమ్మాయిలకు వల వేస్తూ ఉండేది. క్యాటిరంగ్ సెంటర్‌లో ఉద్యోగాలు ఇస్తానని నమ్మించి ఆమె అమ్మాయిలను రొంపిలోకి దింపేది.
గున్నాబాయి చేతిలో మోసపోయినవారిలో నిజామాబాద్‌లోని మాలపల్లి, బోధన్, నవీపేట మండలాలకు చెందిన అమ్మాయిలున్నారు.












Click it and Unblock the Notifications