నిర్మాత పేరుతో సెక్స్ రాకెట్: తారా చౌదరి అరెస్టు

తారా చౌదరి తాను నిర్మాతనని చెప్పుకుని అమ్మాయిలను వలలో వేసుకుని వ్యభిచారంలోకి దింపుతోందని, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేసిందని టీవీ చానెల్ కథనం సారాంశం విజయవాడకు చెందిన ఓ అమ్మాయి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కీర్తిప్రియ అనే బాధితురాలు కూడా ఆ టీవీ చానెల్‌ను ఆశ్రయించింది. హెచ్‌ఎంటీవీ కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో పలువురు బాధితాలు లైన్లోకి వచ్చారు. తారా చౌదరి కూడా గతంలో బాధితురాలేనని, ఇప్పుడు ఇలా మారిందని జయ వింధ్యాల అనే సామాజిక కార్యకర్త అన్నారు.
టీవీ కథనం ప్రకారం - లక్ష్మి 15 రోజుల క్రితం తారా చౌదరి ముఠా ఉచ్చులో పడింది. ఆమెను 15 రోజుల పాటు హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో నిర్బంధించారు. అయితే, అతి కష్టం మీద లక్ష్మి ఆ ముఠానుంచి తప్పించుకుని హెచ్‌ఎంటీవిని ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications