పెళ్లైనా ప్రియుడితో వెళ్లిందని నగ్నంగా చెట్టుకు కట్టేశారు

వారిని రక్షించేందుకు అడ్డు వచ్చిన పోలీసులను రాళ్లతో కొట్టి తరిమేశారు. ఇది తమ గ్రామ పంచాయతీలో తేల్చుకోవాల్సిన విషయమని, దీనిలో జోక్యం చేసుకోవద్దని పోలీసులను హెచ్చరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్కోలి గ్రామానికి చెందిన ఓ వివాహిత మరో వ్యక్తితో పదిహేను రోజుల క్రితం గ్రామం విడిచి వెళ్లిపోయింది. సమీప కళ్యాణ్‌పూర్‌లో ఆమెను, ఆమెతో పాటు ప్రియుడిని గుర్తించిన గ్రామస్తులు వారిని బలవంతంగా గ్రామానికి తీసుకు వచ్చారు.
వారిని గ్రామంలో నగ్నంగా ఓ చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత గుండు కొట్టించారు. విషయం తెలుసుకొని తాము అక్కడకు వెళితే గుంపులుగా తమపై రాళ్లతో గ్రామస్తులు దాడి చేశారని పోలీసులు చెప్పారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పారన్నారు. బాధితులను కాపాడటానికి ఎంత ప్రయత్నించినా గ్రామస్తులు అడ్డుకొంటున్నారని, గ్రామ పంచాయతీలోనే పరిష్కరించుకుంటామని స్థానికులు చెబుతున్నారన్నారు.
అయితే అనంతరం పోలీసులు వెళ్లి వారిని రక్షించారు. గ్రామంలో ఇప్పటికీ పరిస్థితి కొద్దిగా ఉద్రిక్తంగా ఉందని, బాధిత మహిళ, ఆమె ప్రియుడు తమ కస్టడీలో భద్రంగా ఉన్నారని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications