రేప్: అవమానంతో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి

అడవిలో ఒంటరిగా ఉన్న అమ్మాయిని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి హుస్సేనే ఆమెపై అత్యాచారం జరిపాడు. అమ్మాయిని అక్కడే వదిలేసి అతను పారిపోయాడు. ఆదివారం రాత్రి ఆ బాలిక బావిలో దూకినప్పుడు తాము చూసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
రేప్ జరిగిన తర్వాత అమ్మాయిని అవమానాలకు గురిచేసి ఉంటారని, దానివల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా బావి దగ్గరకు చేరుకున్నారు. ఆ తర్వాత ఆమె శవాన్ని బావిలోంచి తీశారు.
నిందితుడిపై తాము కేసు నమోదు చేశామని, అతను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం తర్వాత అమ్మాయి శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications