బాయ్‌ఫ్రెండ్‌ని పంపి నేపాల్ లా విద్యార్థిని గ్యాంగ్‌రేప్!

ఇరవై రెండేళ్ల ఆ యువతి తన బాయ్ ప్రెండ్ నిర్మల్ కుమార్‌తో కలిసి బెంగళూరు యూనివర్శిటీ, లా యూనివర్సిటీ మధ్యలో షికారు చేస్తున్న సమయంలో ఇది జరిగింది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఓ టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగి. వారు అక్కడ షికారు చేస్తున్న సమయంలో ఎనిమిది మంది వచ్చి తొలుత డబ్బులను డిమాండ్ చేశారు.
దాంతో నిర్మల్ వారుతో.. తన పర్సును కారులో మరిచిపోయి వచ్చానని చెప్పాడు. తీసుకు రమ్మని వారు ఆదేశించారు. అతను పర్సు కోసం వెళ్లి వచ్చేసరికి అక్కడ తన గర్ల్ ఫ్రెండ్‌తో పాటు వచ్చిన వాళ్లు కూడా లేరు. దీంతో నిర్మల్ వెంటనే క్యాంపస్‌కు వచ్చి ఓ కానిస్టేబుల్‌కు విషయాన్ని చెప్పాడు. ఇద్దరు కలిసి ఆమె కోసం వెతికారు.
నిర్మల్, కానిస్టేబుల్ కలిసి వెతగ్గా అమ్మాయి నాలుగు కిలోమీటర్ల దూరంలో కనిపించింది. ఈ ప్రదేశం జ్ఞానభారతి క్యాంపస్‌కు దగ్గరలో ఉంది. ఇది మొత్తం అడవి ప్రాంతం. ఆమె బట్టలు చిందర వందరగా ఉన్నప్పటికీ శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. తనను లైంగికంగా వేధించారని ఆ అమ్మాయి జ్ఞానభారతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విద్యార్థిని మెడికల్ పరీక్షల కోసం పంపించారు.












Click it and Unblock the Notifications