స్పానిష్ అమ్మాయిని రెండుసార్లు రేప్ చేసిన దొంగ

27 ఏళ్ల స్పానిష్ యువతి సంగీతాన్ని నేర్చుకునేందుకు ముంబయి వచ్చింది. ఆమె సంగీతం ప్రయివేట్ క్లాసులు కూడా తీసుకుంటోంది. ఈమె సోమవారం రోజు తన ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంది. తనతో పాటు కలిసి ఉండే మరో యువతి బయటకు వెళ్లింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పెర్రీ క్రాస్ రోడ్డులోని బంగ్లాలోకి వచ్చాడు. అయితే పని మనుషులు చూడటంతో అతను ఎక్కడి నుండి పారిపోయాడు.
ఆ తర్వాత అతను అదే బంగ్లాకు అనుసంధానించబడి ఉన్న బంగ్లాలోకి వెళ్లాడు. ఇతను ఓ సీనియర్ సిటిజన్ ఇంట్లో రాబరీ చేశాడు. ఆ తర్వాత స్పానిష్ యువతి బంగ్లాలోకి ఎంటర్ అయ్యాడు. పైప్ ద్వారా ఆ యువతి ఉంటున్న మూడో ఫ్లోర్‌కి వచ్చాడు. స్పానిష్ యువతి నాలుగు నెలలుగా అక్కడే ఉంటోంది. కిటికీ గుండా లోపలకు వచ్చాడు. అతను తన ముఖానికి కర్చీఫ్‌ను కట్టుకున్నాడు. ఆమెను నిద్ర లేపాడు.
కత్తి చూపించి బెదిరించి దగ్గరున్న నగలను ఇచ్చివేయమని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. దొంగను చూసి షాక్‌కు గురైన ఆమె వెంటనే బెడ్ మీద నుండి కిందకు దిగి, పక్క ఇంటి తలుపును తట్టింది. కానీ ఇంట్లో ఎవరూ లేరు. దీంతో ఆ దొంగ ఆమెను ఇంటిలోకి లాగాడు. ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత మరోసారి ఆమెను నగలు, డబ్బు కోసం అడిగాడు. ఆమె ఇంట్లో కొద్దిగా విదేశీ కరెన్సీ లభించింది.
ఆ తర్వాత ఓ సిగరేట్ ముట్టించి అక్కడే కూర్చున్నాడు. మరోసారి స్పానిష్ యువతి వద్దకు వెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆమె సహాయం కోసం ఆర్తనాదాలు చేసింది. ఆమె అరుపులు విన్న వాచ్ మెన్ అవి పక్క బంగ్లాలో నుండి వస్తున్నాయని భావించాడు. దొంగ పారిపోయిన తర్వాత వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దొంగ కోసం వెదుకుతున్నారు.












Click it and Unblock the Notifications