ఐదేళ్ల బాలిక రేప్: స్టూడెంట్‌ను గర్భవతిని చేసిన టీచర్

వరంగల్ జిల్లాలో ఓ కీచక టీచర్ భాగోతం వెలుగులోకి వచ్చింది. చింతల్ ఉర్దూమీడియం పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువున్న విద్యార్థినిని మాయమాటలతో నమ్మబలికి ఆమెను గర్భవతిని చేశాడు ఓ టీచర్. విషయం తెలిసిన తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నాడు.
ప్రకాశం జిల్లా ఒంగోలు పాపాకాలనీలో ఓ దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందని భార్యపై ఓ కసాయి భర్త దాడి చేశాడు. తల్లీబిడ్డను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను వెంటనే రిమ్స్‌కు తరలించారు.
హైదరాబాద్‌లోని నాచారంలో గల విజ్ఞాన భారతి స్కూల్‌లో ఓ విద్యారిని పీఈటీ టీచర్ చితకబాదాడు. విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థిపై చేయిచేసుకున్న ఉపాధ్యాయుడి పై బంధువులు దాడి చేశారు.












Click it and Unblock the Notifications