ఏడు రోజులు బాలికపై రేప్: కట్టేసి విద్యార్థులపై ర్యాగింగ్

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సిఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాలలో బుధవారం సాయంత్రం కొంత మంది సీనియర్ విద్యార్థులు జనియర్ విద్యార్థులను తాళ్లతో కట్టేసి ఎండలో కూర్చోబెట్టి కాసేపటికి వదిలేశారు. దీంతో జూనియర్ విద్యార్థులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ర్యాగింగ్‌కు పాల్పడిన 14 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిపై ర్యాగింగ్ కేసు నమోదు చేశారు.
తల్లీకూతుళ్ల ఆత్మహత్య
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగర్ దగ్గర గురువారం ఉదయం కృష్ణా నదిలో దూకి తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కరీంనగర్ జిల్లాలోని కొహిడ మండలం శనిగరం వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సుమో - వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు.
నడిరోడ్డుపై వ్యక్తి హత్య
హైదరాబాదులోని మొజంజాహీ మార్కెట్ సమీపంలోని దారుస్సలాం రోడ్డులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హతుడ్ని రౌడీ షీటర్ అబూ అలీ బకర్‌గా పోలీసులు గుర్తించారు. ప్రత్యర్థులే అతన్ని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కత్తులతో నరికి అతన్ని హత్య చేశారు. ఈ హత్యలో ఐదుగురు పాల్గొన్నట్లు చెబుతున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తల్లీకొడుకులపై దాడి
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లిలో తల్లీకొడుకులపై దుండగులు కత్తులతో దాడి చేశారు ఈ దాడిలో కుమారుడు మరణించగా, తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications