కారులోకి లాగి యువతిపై సామూహిక అత్యాచారం

పని చేసి ఇంటికి తిరిగి వస్తున్న అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు బస్ స్టాపు వద్ద బలవంతంగా కారులోకి లాక్కున్నారు. ఆ తర్వాత దూరం పోయిన తర్వాత కారులోకి మరో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. కారులో తిరగుతూ వారు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కారు స్టీరియోలో పెద్దగా సంగీతం పెట్టుకుని దురాచారానికి పాల్పడ్డారు. నగరం కంటోన్మెంట్ ప్రాంతంలో అమ్మాయిని పడేసి పోయారు. బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.
సామూహిక అత్యాచారానికి పాల్పడినవారిలో ఇద్దరిని తాము గుర్తించామని, త్వరలోనే ఆరెస్టు చేస్తామని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications