మహిళపై రేప్, హత్య: మరో అత్యాచార నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పల్లెపాలెంలో బాలికపై అత్యాచారం జరిపిన నిందితుడు మల్లికార్జున్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గత నాలుగు రోజులుగా అతన పరారీలో ఉన్నాడు. అతన్ని అరెస్టు చేసి పోలీసులు కోర్టుకు తరలించారు.
మానసిక వింకలాంగురాలి రేప్...
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఓ మానసిక వికలాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు శుక్రవారం అత్యాచారానికి దిగారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు నిందితులకు దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
విద్యార్థిని అదృశ్యం...
విశాఖపట్నం జిల్లా భిమిలీ మండలం సింగనబందలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అదృశ్యమైంది. విద్యార్థిని గురువారంనాడు విశాఖ రైల్వే స్టేషన్‌లో మాయమైనట్లు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాలుడి అదృశ్యం...
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన సాయిరాజ్ అనే 12 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. తమ పిల్లవాడు గురువారం నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆందోళనకు దారి తీసిన వ్యక్తి మృతి..
విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డులో శుక్రవారం ఓ ఉద్యోగి గుండెపోటుతో మరణించాడు. ఈ సంఘటన ఆందోళనకు దారి తీసింది. ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న కుంచారావు శుక్రవారం ఉదయం హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దాంతో అతన్ని చికిత్స కోసం తోటి సిబ్బంది షిప్ యార్డులోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో అతడు మరణించాడు. దీంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
అడవుల్లో గుర్తు తెలియని వ్యక్తి హత్య
నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం సరిసనంబేడు అడవుల్లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతని మృతదేహాన్ని పరిసర ప్రాంతాల ప్రజలు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం శవాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications