మాజీ ప్రియుడి యాసిడ్ దాడి: మహిళ మృతి

పోర్సాలో మద్యం సేవించి ఆ వ్యక్తి తన మాజీ ప్రేయసి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి చొరబడి ఆమెను పిలువాలని హెచ్చరించాడని, ఆమె అంగీకరించకపోతే చంపుతానని బెదిరించాడని, అతను తాగి ఉన్నాడని, చేతిలో యాసిడ్ సీసాఉందని చెబుతున్నారు. తన బంధువులతో పాటు ఆమె నిద్రిస్తున్న గదిలోకి చొరబడి యాసిడ్ దాడి చేశాడని కుటుంబ సభ్యులు ఓ జాతీయ మీడియా సంస్థ ప్రతినిధితో చెప్పారు.
బాధితురాలికి అప్పటికే పెళ్లయింది. అరవై శాతం కాలిన గాయాలతో ఆమె మొరేనా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పెళ్లయిన తర్వాత బాధితురాలు తన భర్తతో పాటు అంబాలోని అద్దె ఇంట్లో దిగింది. ఆ ఇల్లు నిందితుడికి సంబంధించింది. నిందితుడితో వైవాహికేతర సంబంధం ఉందని భావించి భర్త ఆమెను నిరుడు వదిలేశాడని చెబుతున్నారు.
నిందితుడితో తనకు సంబంధం ఉందని, తప్పుగా అర్థం చేసుకుని అతను దాడి చేశాడని మహిళ తన మరణ వాంగ్మూలంలో చెప్పింది. అయితే, తన భర్త వదిలేసిన తర్వాత నిందితుడితో సంబంధం కొనసాగించడానికి ఆమె నిరాకరించి తల్లిగారింటికి చేరుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications