దారుణం: కన్న కూతురుపై మూడేళ్లుగా అత్యాచారం

51-year-old alcoholic man rapes daughter for 3 years
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని కోట జిల్లాలోని గుమన్పూరలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కామాంధుడై తన కన్న కూతురుపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. తండ్రికి బయడిన బాధితురాలు, కుటుంబ సభ్యులు ఈ ఘాతుకాన్ని బయటికి చెప్పుకోలేదు. ఇటీవలే బాధితురాలికి వివాహమైంది.

హోలీ సంబరాలు జరుపుకుందామని పుట్టింటికి వచ్చిన కూతురు(21)పై మళ్లీ అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు ఆ దుర్మార్గపు తండ్రి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడైన తండ్రి దినేష్ సోనీ(51)ని అరెస్ట్ చేసినట్లు బుధవారం పోలీసులు తెలిపారు.

ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. బాధితులు 9 ఏళ్లు ఉన్నప్పటి నుంచే ఆ తండ్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఆమెకు 12 ఏళ్లు వచ్చే వరకు ఆమెపై తరచూ అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడు. తండ్రి బెదిరింపులకు బయపడిన బాధితురాలు, కుటుంబ సభ్యులు ఈ ఘాతుకాన్ని తమలో దాచుకున్నారు.

కోటలోని ప్రభుత్వ కళాశాలలో బిఏ పూర్తి చేసిన బాధితురాలికి ఈ ఏడాది జనవరిలో వివాహం జరిగింది. హోలీ సంబరాల కోసం వచ్చిన తనపై మళ్లీ అత్యాచారానికి ప్రయత్నించగా.. అడ్డుకున్న బాధితురాలి పోలీసులను ఆశ్రయించింది. కాగా, తన పట్ల తన తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మరో కూతురు నిందితునిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంగారం దుకాణం నడుపుతున్న నిందితుడు దినేష్ సోనీకి మద్యం అలవాటుందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions