బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్: సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ

ఈ దారుణమైన సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండలో చోటు చేసుకుంది. పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితులంతా పదకొండేళ్ల లోపువారే. ఈ సంఘటన స్థానిక తీవ్ర కలకలం సృష్టించింది.
ఇదిలావుంటే, తిరుపతిలోని ఎన్నారై అకాడమీ విద్యార్థిని సింధు (20) గత అర్థరాత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దాంతో తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న సింధు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.
ఆమె ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సింధు ఆత్మహత్యపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications