కూతురిపై తండ్రి రేప్: గర్ల్‌పై మాజీ ఆర్మీ ఉద్యోగి రేప్

నూకేష్ మద్యానికి బానిసై రోజూ ఇంటిలో గొడవ పడుతుండడంతో భార్య విడిపోయి నాలుగేళ్ళుగా విడిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం భార్య, కుమార్తెను ఇంటికి తీసుకుని వచ్చాడు. మద్యం మత్తులోఉన్న నూకేష్ కన్న కూతురిపై అత్యాచారం జరిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నూకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మండలం మాలాయకోటలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి బెంజిమెన్ (70) అత్యాచారం జరిపాడు. గత రెండు, మూడు రోజులుగా బాలిక అస్వస్థతగా ఉండడంతో మంగళవారం విద్యార్థి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా బాలిక ఏడు నెలల గర్భవతి అని డాక్టర్ చెప్పడంతో తల్లిదండ్రులు దిగ్భ్రాంతి చెందారు.
కూతురిని వారు ప్రశ్నింగా ఇంటి పక్కన ఉన్న తాతయ్య (బెంజిమన్) రోజూ చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న బెంజిమన్ పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications