పక్కింటి అమ్మాయిపై రేప్: హైదరాబాద్‌లో దోపిడీ
నిజామాబాద్/ హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో కీచకపర్వం చోటు చేసుకుంది. ఓ అమ్మాయిపై పక్కింటి అబ్బాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. నాగారం గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు తన ఇంటి పక్కన నివాసం ఉంటన్న 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి డాబాపైకి తీసుకుని వెళ్లి అత్యాచారం జరిపినట్లు నిజామాబాద్ ఫిఫ్త్ టౌన్ పోలీసులు సోమవారం తెలిపారు.
గత రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. బాధితురాలి తండ్రిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడిపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా వుంటే, హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో సోమవారం దారి దోపిడీ జరిగింది. ఎక్సెస్ బ్యాంక్‌లోని నరసింగరావు అనే వ్యక్తి ఐదు లక్షల రూపాయలు డ్రా చేసి తీసుకువెళుతుండగా ఇద్దరు అగంతకులు మోటారు బైక్‌పై వచ్చి నగదు బ్యాగ్‌ను తీసుకుని పరారయ్యారు.
దీంతో దిగ్భ్రాంతికి గురైన బాదితుడు తేరుకుని స్థానికుల సహాయంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్యాంక్‌లోని సీసీ కెమెరాల పూజేటీలను పోలీసులు సమీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications