సోదరిపై అన్న రేప్: గర్ల్‌పై గ్యాంగ్ రేప్‌కు మహిళ హెల్ప్

లక్నో/థానే: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో.. మానసిక వికలాంగురాలైన ఓ యువతి అన్న కామవాంఛకు బలైంది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను చెల్లెలు వైద్యుల వద్దకు తీసుకెళ్లడంతో ఏడు నెలల గర్భిణి అని తేలింది. ఆరా తీస్తే సొంత అన్నే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు యువతి వెల్లడించింది.

ఆ కామాంధుడికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లయినా వారితో వేరుపడి ఉంటున్నాడు. నాలుగేళ్లుగా ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు. చెల్లెలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

మరో ఘటనలో జైపూర్ పరిధిలోని బాగ్రిలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రెండో తరగతి చదువుతున్న నలుగురు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Girl raped in Thane

థానేలో ఓ యువతిపై ముగ్గురు యువకులు 5 రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి ఆమెతో సన్నిహితంగా మెదిలే మరో మహిళ సహకరించింది. ఓ ఫ్లాట్‌లో ఉంటున్న బాధితురాలిని, అదే అపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ మహిళ మత్తు మందు ఇచ్చి మరీ ఈ దారుణానికి ఒడిగట్టించింది.

ఎదిరించిన యువతిని దారుణంగా కొట్టడమే కాకుండా, ఎవరికైనా చెబితే గొంతు కోస్తామని బెదిరించిన ముగ్గురు నిందితులు ఏప్రిల్ 16 నుంచి 20 వరకు ఈ అకృత్యానికి పాల్పడ్డారు. సహకరించిన మహిళను, ముగ్గురు యువకులను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions