వలలో 27 మంది మహిళలు: రాసలీలలు, నీలిచిత్రాలు
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని దిండుగల్ జిల్లాలో ఓ కామాంధుడి రాసలీలలు వెలుగుచూశాయి. ప్రేమ పేరుతో 27 మంది యువతులను మోసం చేయడమేకాకుండా, లైంగిక అనుభవించి, నగ్నంగా వీడియోలు తీసి, వాటిని సీడీలుగా మార్చి విక్రయిస్తూ వచ్చిన ఓ యువకుడిని ఆ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి.
వివరాలు ఇలా ఉన్నాయి - దిండిగల్, మాసిలామణిపురం, శ్రీనగర్‌కు చెందిన బెన్సిఫి అనే 21 యేళ్ళ యువకుడిపై మదురై జిల్లా అనైయూర్ ముడక్కత్తాన్ రోడ్డుకు చెందిన 24 ఏళ్ల యువతి ఆ జిల్లా పోలీసులకు ఒక ఫిర్యాదు ఇచ్చింది. ఆ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్లస్ టూ వరకు మాత్రమే పూర్తి చేసిన బెన్సిఫి చూసేందుకు ఆకర్షణీయంగా ఉండటంతో అనేక మంది యువతులు తన వలలో వేసుకున్నట్టు తేలింది. తొలుత ప్రేమిస్తున్నట్టుగా యువతులను నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన శీతలపానీయం ఇచ్చిస అత్యాచారం చేయడం, నగ్న ఫోటోలు తీసి, వాటిని స్నేహితులకు చూపించడమే కాకుండా సీడీలుగా మార్చి ఇతర ప్రాంతాలకు విక్రయించినట్టు తేలింది.

మాసిలామణిపురం, శ్రీనగర్‌లోని బెన్సిఫి ఇంటికి కేవలం అతని స్నేహితులు మాత్రమే వచ్చి వెళ్ళేవారని పోలీసులు తెలుసుకున్నారు. ఈయన తల్లి వేరే ప్రాంతంలో ఉంటూ నెలవారి ఖర్చుల కోసం రూ.50 వేలు చొప్పున కుమారుడికి పంపించేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ డబ్బుతో మోటార్ బైకులపై చక్కర్లు కొడుతూ జల్సాలు చేస్తున్నట్టు తేలింది.
బెన్సిఫి ప్రేమ వలలో అనేక మంది కాలేజీ అమ్మాయిలతో పాటు పలువురు మహిళలు కూడా చిక్కినట్టు సమాచారం. కొంతమంది అమ్మాయిలైతే డబ్బు కోసం బెన్సిఫి ఇంటికి వచ్చి వెళ్తూ, అతని కామదాహానికి బలైనట్టు పోలీసులు గ్రహించారు. ఇలా మొత్తం 27 మందికిపైగా యువతుల జీవితాలను బెన్సిఫి నాశనం చేసినట్టు పోలీసులు చెపుతున్నారు.
దీంతో రెజీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెన్సిఫితో పాటు ఈయన తల్లి హేమమాలిని, బంధువు రాజాలపై కేసులు నమోదు చేశారు. బెన్సిఫిపై మాత్రం 498ఏ, 294బి, 406, 417, 506(1)తో పాటు, మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, తన బండారం బయటపడటంతో బెన్సిఫి దిండిగల్ నుంచి సేలంకు మకాం మార్చాడు. అయితే, పోలీసులు చాకచక్యంతో సేలంలో ఉన్న బెన్సిఫి ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications