OTTని షేక్ చేస్తున్న తెలుగు కామెడీ సిరీస్.. ఇండియా మొత్తం ట్రెండింగ్!

తెలుగు ఓటీటీ రంగంలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'సేవ్ ది టైగర్స్' ఫ్రాంచైజీ, ఇప్పుడు మూడో సీజన్‌తోనూ దుమ్ములేపుతోంది. జూన్ 19న జియో హాట్‌స్టార్‌లో విడుదలైన 'సేవ్ ది టైగర్స్ 3' ప్రస్తుతం ఇండియా వైడ్‌గా టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. భార్యాభర్తల మధ్య జరిగే ఈగో వార్స్, నిత్యం ఇంట్లో జరిగే గొడవలు, అలకలను అత్యంత హాస్యభరితంగా, సెటైరికల్‌గా చూపించడంతో ఈ సిరీస్ సగటు ప్రేక్షకుడికి బాగా కనెక్ట్ అయిపోయింది.

సాధారణంగా ఒక వెబ్ సిరీస్‌కు వరుస సీజన్లు వచ్చేకొద్దీ క్రేజ్ తగ్గిపోతుంటుంది. కానీ, 'సేవ్ ది టైగర్స్' టీమ్ మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేసింది. మొదటి రెండు సీజన్ల కంటే మిన్నగా మూడో సీజన్‌ను మలిచి, విడుదలైన కొద్ది రోజుల్లోనే భారీ వ్యూస్‌తో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజిటల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఇప్పుడొచ్చే ఓటీటీ థ్రిల్లర్స్ కు ఈ సినిమా తాత లాంటిది
ఇప్పుడొచ్చే ఓటీటీ థ్రిల్లర్స్ కు ఈ సినిమా తాత లాంటిది
Save the Tigers A Telugu comedy series is taking the OTT world by storm trending across India

మహి వి రాఘవ్ 'సక్సెస్' ఫార్ములా

ఈ సిరీస్ వరుస విజయాల వెనుక షోరన్నర్ మహి వి రాఘవ్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' వంటి సినిమాలతో పాటు, ఓటీటీలో 'సైతాన్' లాంటి డార్క్ థ్రిల్లర్‌ను తెరకెక్కించిన మహి.. ఒక ఫ్రాంచైజీని సక్సెస్‌ఫుల్‌గా ఎలా నడపాలో మరోసారి నిరూపించారు. కథలో ఎమోషన్ మిస్ అవ్వకుండా, కమర్షియల్ వ్యాల్యూస్‌ను జోడిస్తూ అసలు సిసలైన వినోదాన్ని అందించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. "ఇండియాలో టెలివిజన్ సిరీస్ ఫార్ములాకు మన ప్రేక్షకులు ఇంకా పూర్తిగా అలవాటు పడలేదు. అందుకే మన దగ్గర ఓటీటీ కల్చర్ ఇంకా ఎదుగుతోంది" అని అభిప్రాయపడిన మహి, తన నిర్మాణ సంస్థ 'త్రీ ఆటమ్ లీవ్స్' ద్వారా రొటీన్ ఫార్ములాలకు భిన్నంగా సరికొత్త రీజినల్ కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించడం విశేషం.

టాలీవుడ్‌లో 8 వారాల ఓటీటీ రూల్?
టాలీవుడ్‌లో 8 వారాల ఓటీటీ రూల్?

నవ్వుల పూయిస్తున్న 'టైగర్స్' కూటమి

ఈ సిరీస్ సక్సెస్‌లో ప్రధాన పాత్రధారుల యాక్టింగ్, టైమింగ్ కీలక పాత్ర పోషించాయి. ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠంల కామెడీ టైమింగ్ సిరీస్‌ను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లింది. వారికి తోడుగా దేవియాని శర్మ, పావని గంగిరెడ్డి, జోర్దార్ సుజాతల నటన భార్యాభర్తల రిలేషన్‌షిప్‌ను రియలిస్టిక్‌గా స్క్రీన్‌పై పండించింది. వారాంతంలో కుటుంబం అంతా కలిసి కూర్చుని హాయిగా నవ్వుకునే కంటెంట్ కోసం చూసే వారికి 'సేవ్ ది టైగర్స్ 3' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. నేషనల్ లెవెల్లో టాప్-10 లో దూసుకుపోతున్న ఈ సిరీస్, రాబోయే రోజుల్లో మరిన్ని వ్యూస్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+