దారుణం: రెండేళ్లుగా కూతురిపై తండ్రి అఘాయిత్యం

పాఠశాలకు పంపాలంటే తన కామవాంఛ తీర్చాలని వెంకటేశులు షరతు పెట్టాడు. అసలు లైంగిక వ్యవహారం గురించి తెలియని ఆ బాలిక తండ్రి చేతుల్లో నరకం అనుభవించింది. రాత్రిపూట బాలిక ప్రక్కనే పడుకుని కామకోర్కెలు తీర్చుకునేవాడు. గత రెండేళ్లుగా బాలికపై ఈ అఘాయిత్యం చేస్తూనే ఉన్నాడు.
ఓ రోజు రోజు రాత్రిపూట కూతురిపై అతడు లైంగిక దాడిని సాగిస్తుండగా అతని భార్య చూసి నిలదీసింది. దాంతో ఆమెను చితకబాదాడు. నోరు తెరిస్తే చంపేస్తానని బెదిరించాడు. మరుసటి రోజు స్కూలుకు తీసుకెళతానని తిమ్మాపురం నుంచి డోన్‌కు తీసుకెళుతూ మార్గమధ్యంలో రోడ్డు ప్రక్కకు తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోయాడు.
అయితే, ఆ బాలిక అతడి నుంచి తప్పించుకుని డోన్ పోలీసు స్టేషను సమీపంలోకి వెళ్లింది. అక్కడ ఆ బాలికను ఉపాధ్యాయురాలు చూసి పోలీసు స్టేషనుకు తీసుకెళ్లింది. బాలిక తన తండ్రి తనపై చేస్తున్న అకృత్యాల గురించి చెప్పింది. అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications