హైటెక్ వ్యభిచారం: భార్యాభర్తలతో సహా ముఠా అరెస్టు

దాడుల్లో భార్యాభర్తలతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతికి చెందిన ఇద్దరు బాలికలను రక్షించి, చైల్డ్ హోమ్‌కు తరలించారు. నిర్వాహకుడు వీకె రెడ్డి, బ్రోకర్ జిలానీలు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారైనవారి కోసం గాలిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పించి ఆ ఆపార్టుమెంటులో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
సిఎ విద్యార్థి ఆత్మహత్య
అర్థిక ఇబ్బందులతో పాటు ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో మనస్తాపానికి గురైన ఓ సిఎ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్‌లోని భుక్తాపూర్ కాలనీకి చెందిన అక్షయ్ (22) విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో సిఎ చదువుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచ్చాడు. సోమవారం రాత్రి అతు గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని మరణించాడు.
పోలీసులకు ఘటనా స్థలం వద్ద సూసైడ్ నోట్ లభించింది. విజయవాడలో అతను 70 వేల రూపాయలు అప్పు చేశాడని, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఆ నోట్ ద్వారా తెలిసింది. ఆ కారణాలతోనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని తేలింది.












Click it and Unblock the Notifications