బాలికపై సామూహిక అత్యాచారం: విద్యార్థి ఆత్మహత్య

అందులో అప్పటికే ఆల్కహాల్ కలిపి ఉంచడంతో కొద్ది సేపటికి మత్తులోకి అమ్మాయి జారిపోయింది. దాన్ని ఆసరాగా తీసుకుని గంపా నాగరాజు, పూజారి శ్రీను గ్రామంలోని ఇళ్ల మధ్యలో గల ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లారు. మత్తులో ఉన్న ఆ బాలికపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం జరిపి పరారయ్యారు.
స్పృహ వచ్చిన తర్వాత ఆ బాలిక కేకలు వేయడంతో సమీపంలోని ఓ గృహిణి ఆమెకు దుస్తులు ఇచ్చి రక్షించి ఇంటి వద్ద వారి తల్లిదండ్రులకు అప్పగించింది. గురువారం బాధితురాలి బంధువులు దమ్మపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదుతో సంఘటన వెలుగుచూసింది.
తోటి విద్యార్థుల ముందు లెక్చరర్ అవమానించడాన్ని జీర్ణించుకోలేక మనస్తాపానికి గురైన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లిలోని ఎపిఎస్‌పి 7వ బెటాలియన్‌లో కుక్‌గా పనిచేసే దేవయ్య కుమారుడు ఎస్.పవన్‌కల్యాణ్ జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కాలేజీలో సిఇసి ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు.
దసరా సెలవులకు ముందు నిర్వహించిన త్రైమాసిక పరీక్షలకు హాజరుకాలేదు. దీనిపై లెక్చరర్ ఆ విద్యార్థిపై సహ విద్యార్థుల ముందే అవమానించి చేయి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనై ఇంటికి వెళ్లిన పవన్‌కల్యాణ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగాయి.












Click it and Unblock the Notifications