}

కత్తితో బెదిరించి మహిళపై రేప్: పరారీలో యువకుడు

 A woman allegedly raped by a youth in Renigunta
చిత్తూరు: మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా నిర్భయ వంటి కఠిన చట్టాలెన్ని తెస్తున్నా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలోని రేణిగుంటలో 55 ఏళ్ల మహిళను 23 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. వేసవి కావడంతో రేణిగుంటకు చెందిన ఓ మహిళ (55), భర్తతో కలిసి ఆరుబయట నిద్రిస్తోంది.

ఆదివారం అర్ధరాత్రి ఈశ్వరయ్య అనే యువకుడు వారింటి వద్దకొచ్చాడు. ఆ మహిళను నిద్రలేపి.. అరిస్తే చంపేస్తానని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగక మరోసారి అత్యాచారం చేయడానికి బహిరంగ ప్రదేశానికి రావాలని బెదిరించాడు.

దీంతో ఎక్కడ చంపుతాడోనని భయపడ్డ ఆ మహిళ బహిరంగ ప్రదేశానికి వెళుతూ ఎలాగోలా తప్పించుకుని మళ్లీ ఇంటికి చేరింది. జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది.

బాధిత దంపతులు స్థానిక నాయకుల మద్దతుతో రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి రుయాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడని రేణిగుంట అర్బన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Are You Over 18?
By entering the site, you agree to our terms and conditions