అమ్మాయిని రేప్ చేసి, లారీ నుంచి తోసేశారు

ఆదివారం జిల్లా రూరల్ ఎస్పీ పాల్‌రాజ్ బాధితురాలిని పరామర్శించారు. లారీ డ్రైవర్, ఓనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై నిర్భయ చట్టం నమోదు చేస్తున్నట్లు రూరల్ ఎస్పీ పాలరాజు ప్రకటించారు. అత్యాచారానికి గురైన యువతి హైద్రాబాద్‌లోని హుస్సేన్‌శావలి దర్గా ప్రాంతానికి చెందింది.
లారీలో ఎక్కించుకుని సిద్దిపేట వైపు వస్తున్న క్రమంలో లారీలోనే అమ్మాయిపై డ్రైవర్‌తో పాటు యజమాని ఆమెపై అత్యాచారం జరిపి ఆ తర్వాత బచ్చన్నపేట సమీపంలోని తమ్మడపల్లి వద్ద తోసేశారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెకు అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించి ఆ తర్వాత జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలుకి వివాహం కాగా భర్త వదిలేయడంతో సోదరులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. లారీ డ్రైవర్ కృష్ణా జిల్లా వీర్లపాడు గ్రామానికి చెందిన వనకంటి రామయ్య, యజమాని కృష్ణా జిల్లా గుండ్లపూడి గ్రామానికి చెందిన ఎర్రగుంట వెంకట్‌రావుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరినీ బచ్చన్నపేట పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకొన్నారు.
బాధితురాలు చెవిటి, మూగ కావడంతో పూర్తి వివరాలు వెల్లడించలేకపోతోంది. పోలీసులు వికలాంగుల టీచర్ల సహాయంతో వివరాలు సేకరించారు. పోలీసులు ఆ యువతిని జనగామ ఏరియా ఆసుపత్రి నుండి చెవిటి, మూగ విభాగానికి తరలించారు.












Click it and Unblock the Notifications