మత్తిచ్చి రేప్ చేసి న్యూడ్ ఫొటోలు నెట్‌లో పెట్టాడు

అల్లం రజాక్ మకామయూమ్ అనే యువకుడు మణిపురికి చెందిన అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాది కాలంగా అతను ఆమెతో స్నేహం చేస్తున్నాడు. మేఘాలయలోని తురాలో ఓ లాడ్జిలో నిరుడు సెప్టెంబర్‌లో ఆమె స్పృహ తప్పేలా చేశాడు. ఆమెపై అత్యాచారం చేశాడు.
పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. అతను పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థి అని పోలీసులు చెప్పారు. బాధితురాలు తురాలో కళాశాల విద్యార్థిని. సెలవుల్లో మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో ఆమె తన ఇంటికి వచ్చింది.
ఆ సమయంలో నిరుడు డిసెంబర్ 20వ తేదీన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో నగ్నంగా ఉన్న తన ఫోటోలను చూసి షాక్ తిన్నది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అతను కూడా మణిపూర్‌కు చెందినవాడే.












Click it and Unblock the Notifications