బెస్ట్‌ సెల్లర్‌ రచయిత హేలీ కన్నుమూత

బెస్ట్‌ సెల్టర్‌ నవలలు రాసిన ప్రముఖ ఆంగ్ల రచయిత ఆర్థర్‌ హేలీ కన్నుమూశారు. బహమాస్‌లోని ఆయన స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు ఎనబై నాలుగేళ్లు. గుండెపోటు వల్ల హేలీ మరణించినట్లు వైద్యులు ధృవీకరించినట్లు ఆయన భార్య షీలా చెప్పారు.

హేలీ 1920 ఏప్రిల్‌ 5వ తేదీన ఇంగ్లాండులోని లూటన్‌లో జన్మించారు. పద్నాలుగేళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆయన విద్యకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. పేదరికం వల్ల తల్లిదండ్రులు ఆయనను చదివించలేకపోయారు. పద్నాలుగేళ్ల వరకు ఇంగ్లాండులో ఉచిత విద్యను అందించడం వల్ల అతను ఆ మాత్రం చదువుకోగలిగారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆయన రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పైలట్‌గా చేరారు. ఆ తర్వాత భార్యతో కలిసి 1969లో బహమాస్‌లో స్థిరపడ్డారు.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆయన కెనడాలో నివాసం ఏర్పరుచుకొని రచనా వ్యాసంగం ప్రారంభించారు. కొంత కాలం అమెరికాలో కూడా జీవించారు. ఆయన రాసిన బెస్ట్‌ సెల్లర్స్‌లో హోటల్‌, స్ట్రాంగ్‌ మెడిసిన్‌, ఎయిర్‌పోర్ట్‌, ఇన్‌ హై ప్లేసెస్‌, ది ఫైనల్‌ డయాగ్నిసిస్‌, డిటెక్టివ్‌ నవలలు ఉన్నాయి. ఈ నవలలు ముప్పై తొమ్మిది భాషల్లోకి అనువాదం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా నూటా అరవై మిలియన్ల ప్రతులు అమ్ముడయ్యాయి. ఆయన రాసిన చాలా నవలలు సినిమాలుగానో, టీవీ సీరియళ్లుగానో వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+