పార్ట్-18

పిచ్చి గానీ ఆ రోజులు తిరిగి వస్తాయా అని అనుకుని తనలో తానే నవ్వుకున్నాడు విజయేందర్‌ రెడ్డి. ఆయనకు మగతగా ఉంది. కళ్లు మూతలు పడుతున్నాయి. అప్పుడే నిద్ర ముంచుకోస్తోందేమిటని అనుకున్నాడు. తీవ్రంగా అలసిపోవడం వల్ల తకావచ్చునని కుదుటపర్చుకున్నాడు. కాన్వాయ్‌ మధ్యలో తన కారు మెత్తగా దూసుకెళ్తోంది.

మృత్యువు ముంచుకొస్తోందని తెలిస్తే భయమేస్తుంది గానీ అదేమీ లేకుండానే మృత్యువు ఆవహిస్తే.... మందుపాతర పేలి విజయేందర్‌ రెడ్డి కూర్చున్న కారు పైగెసి పడింది. అలా ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. యుద్ధం చేయమని, ఫలితం గురించి ఆలోచించవద్దని కృష్ణపరమాత్ముడు చెప్పాడు. ఇది తెలిసే విజయేందర్‌ రెడ్డి యుద్ధం చేశాడా? నిజంగా పరిణామాలన్నీ ఆయన ప్రమేయంతోనే జరిగాయా? ఇది ప్రశ్న గుర్తే.

రక్తమోడిన శవాన్ని అభిమానుల సందర్శనార్థం పార్టీ కార్యాలయంలో ఉంచారు. వేలాది మంది బారులు తీరారు. అందులో రాంరెడ్డి ఒక్కడా? కాదు గాక కాదు. కేంద్ర హోం మంత్రి ఢిల్లీ నుంచి ఫ్లయిట్‌లో దిగితే రిపోర్టింగ్‌కు వెళ్లాడు. విజయేందర్‌ రెడ్డి మృతదేహాన్ని చూసి రాంరెడ్డి ముఖం వివర్ణమైంది.

తెలంగాణలో ఇంతకు ముందు ఇంకా కొంత మంది రాజకీయ నాయకులను నక్సలైట్లు కాల్చేశారు. క్రియాశీలక రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇంట్లో ఉన్న హయగ్రీవాచారిని ఉదయం పూట పేపర్‌ చదువుతుండగా కాల్చేసి పోయారు. అయితే అప్పుడెప్పుడే లేని ఏదో అలజడి, అసంతృప్తి విజయేందర్‌ రెడ్డి హత్య విషయంలో చెలరేగింది. అది అంతగా పైకి కనిపించలేదు గానీ నిశబ్దంగా పరుచుకుంది. విజయేందర్‌ రెడ్డితో కలిసి బోనగిరిలో చదువుకున్న ఒక కవి తన హృదయ స్పందనను రాసి పత్రికకు పంపాడు. ఈ కవి విప్లవాన్ని, విప్లవోద్యమాన్ని వ్యతిరేకించినవాడు కాదు. పైగా ఎంతో కొంత సానుభూతి ఉన్నవాడు. కవుల్లోని, రచయితల్లోని, మేధావుల్లోని దివాళాకోరుతనం వల్లనే వచ్చిందా? ఆలోచిస్తుంటే రాంరెడ్డికి చిక్కుముడి వీడడం లేదు. రాజ్యానికి, రాజ్యం ప్రయోగిస్తున్న నిర్బంధానికి భయపడి అలా మాట్లాడుతున్నారని వీళ్లందరి మీద ఓ కానరాని ప్రచారం. ఈ ప్రచారం ఎంత అబద్ధమా, నిజామా? ఏది సత్యం, ఏదసత్యం? దీనికి కొలమానాలు ఉన్నాయా? ఈ కొలమానాలు ఎవరు నిర్ణయిస్తారు? ఎవరు తీర్పు చెప్తారు? తీర్పు చెప్పే ముందు ముద్దాయికి మాట్లాడే అవకాశం ఉండదా? అలాంటి అవకాశమేదీ లేకుండానే శిక్ష వేస్తారా? ప్రశ్నలు- ప్రశ్నల మీద ప్రశ్నలు.

ఆలోచిస్తూ దేహం చుట్టూ అల్లుకున్న ముళ్ల కంచె. ఈ కంచెను ఛేదించడమెలా? అంతుబట్టడం లేదు రాంరెడ్డికి. అంతుబట్టే అవకాశం లేదనే విషయం అతనికి తెలియదు. జరుగుతున్నవాటిని చూస్తూ పోవాలే తప్ప ఆలోచించకూడదు. మాట్లాడకూడదు. ఇదింకా అనుభవంలోకి రాలేదు. ఆ అనుభవానికి ఇంకెంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందో!

అంతటితో ఆగిందా? ఆగలేదు గాక ఆగలేదు. నరమేథం ఇరువైపులా కొనసాగుతుంటే గుండె తల్లడిల్లి గుక్క పట్టి ఏడ్వాల్సిందే తప్ప నోరు విప్పకూడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+