పచ్చటి కలలు: పీఠభూమి
కందుకూరి శ్రీరాములు తన ముప్పై ఏళ్ల సుదీర్ఘ కవితా ప్రయాణంలో మడమ తిప్పని యోధుడిగా నడక సాగిస్తూనే ఉన్నాడు. కవిత్వమే జీవితంగా భావించిన శ్రీరాములు తన సాహిత్య రాజకీయమేమిటో, జీవిత సారాంశమేమిటో ఆయన కవిత్వం చెబుతుంది.
సమూహంలో ఒంటరివాడై పోతున్న మనిషి గురించి, సామాజిక రాజకీయార్థిక శక్తుల దుష్టభావాల గురించి, మనిషితనాన్ని పీల్చేసి వాకిలి నుంచి పెరటి దాకా చొచ్చుకొని వచ్చిన వస్తు సంస్కృతి గురించి శ్రీరాములు ఆవేదన ఈనాటిది కాదు. ఆగ్రహం వ్యక్తం చేయడం కర్తవ్యం గుర్తు చెయ్యడమూ కొత్తేమీ కాదు.
ఇటీవల వచ్చిన శ్రీరాములు పీఠభూమి సంపుటి ఆయన తాత్వికతకు అద్దం పట్టిన కావ్యం. వలసవాదుల చేతిలో, భూస్వాముల పడగనీడలో నిస్సారమైపోయిన పీఠభూమిపై నిల్చొని ప్రజల గోడును వినిపిస్తాడు. దీనికి కారకులైన వారిపై ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తాడు. భూమి నీరు లేనిదే జీవి లేదు. మనిషి మనుగడ అసలుకే లేదు. ఈ రెంటిని తనది గాకుండా చేస్తున్న ప్రపంచీకరణ విషకోరల్నించి మనిషిని కాపాడే ప్రయత్నం చేస్తాడు. మనిషికీ మట్టికీ మధ్య గల ప్రగాఢ అనుబంధాన్ని తెలియజేస్తాడు.
బతుకును మట్టిగా చేసుకున్నవాడు
పది మొక్కల్ని మొలిపిస్తాడు
ముద్దలు ముద్దలుగా చేసి
ఇల్లును నిర్మిస్తాడు - అని అనడంలో కవి తాత్వికత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మట్టిని నమ్ముకున్న వాడెప్పుడూ తన కోసం బతకలేదని, పది మందిని బతికిస్తూ తాను బతికాడని చెప్పడంలో వాస్తవిక పరిశీలన ఉంది.
శ్రీరాములు తన కవితా సంపుటికి పీఠభూమి అని పేరు పెట్టడంలోనే గొప్ప ఔచిత్యం దాగి ఉన్నది. తాను పుట్టి పెరిగిన నేల ఒకప్పుడు ప్రపంచం ఆకలి తీర్చిన పీఠభూమి. కానీ ఇప్పుడది ప్రపంచీకరణ మింగేసిన బీడు భూమి. నీటి లక్షణం, భూముల్లాంటి మనుషులు ఒకటే కాబట్టి ఇక్కడ పీఠభూమి అని పేరు పెట్టడంలోనే గొప్ప ఔచిత్యం దాగి ఉంది. తాను పుట్టిపెరిగిన నేల ఒకప్పుడు ప్రపంచం ఆకలి తీర్చిన పీఠభూమి. కానీ ఇప్పుడది ప్రపంచీకరణ మింగేసిన బీడు భూమి. నీటి లక్షణం, భూముల్లాంటి మనుషులు ఒకటే కాబట్టి ఇక్కడ పీఠభూముల్లాంటి మనుషులు సారాన్ని కోల్పోయారు. పచ్చని పైరుతో కనబడే పల్లెలు ఎడారిగా మారిపోయాయి.
చెండోలె ఎగిరే నా పల్లెలు
ఒకే ఒక అమాయకపు మోమున్న పల్లెటూరు
పల్లెను జింకపిల్లతో పోల్చడంలో కవి వాస్తవిక సౌందర్య దృష్టి అర్థమవుతుంది. కవి జీవిస్తున్న సామాజిక పరిస్థితులే అతని కవితావస్తువులు. ఆ సమాజంలోని జీవితాలలోంచి వినబడే వేదనాభరిత మూల్గులే కవి శైలీశిల్పాలనుకుంటే శ్రీరాములు కవిత్వమెప్పుడూ సజీవ శిల్పమే.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications