Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక దశాబ్ది కవిత

Afsar
మంచి సాహిత్యాన్ని అచ్చులోకి, అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పానికి రూపం "సారంగ బుక్స్". మా మొదటి ప్రచురణ 2000 నుంచి 2009 వరకీ వచ్చిన మంచి కవితల సంకలనం. ఈ సంకలనం జూలై మొదటి వారంలో వెలువడుతుంది.

రెండో మిలీనియం తెలుగు కవిత్వంలో కొత్త చేతనకి తలుపులు తీసింది. ఒక వైపు ప్రపంచీకరణ ప్రభావం సృజనాత్మకతని మింగేస్తున్న కాలంలోనే, మరో వైపు కొత్త అభివ్యక్తి గొంతు సవరించుకుంటోంది. ఈ మార్పుని ప్రతిఫలించే ఒక కవితా సంకలనం వెలువరించాలని మా సంకల్పం. ఈ సంకలనంలో 2000 నించీ 2009 వరకూ వివిధ రూపాల్లో - అంటే లిఖిత పత్రికల్లో గానీ, విడి సంకలనాల్లో గానీ, ఇంటర్నెట్లో గానీ - వెలువడిన కవితల్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక్కొక్క కవి నించి మూడు అత్యుత్తమ కవితల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సంకలనానికి మీరు మీ కవితలతో పాటు మీకు నచ్చిన ఇతరుల కవితల్ని కూడా సూచించవచ్చు. మే ఒకటవ తేదీకల్లా కవితలు పంపండి.

మీ కవితలు ఈమెయిల్ ద్వారా [email protected] కి పంపండి. మీరు ఈ కవితా సంకలనం కోసం పంపే ఈమెయిల్స్ లేదా ఉత్తరాల మీద "సారంగ బుక్స్" కోసం అని రాయండి.

సాధారణ తపాలా ద్వారా పంపే వారు:
వంశీ కృష్ణ
కేరాఫ్: లక్ష్మీ గణపతి ప్రింటింగ్ ప్రెస్
మండల్ ఆఫీస్ కాంప్లెక్స్, గంపలగూడెం - 521 403
కృష్ణా జిల్లా – (సెల్ నంబరు: 9491959062)- కి పంప వచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+