యాకూబ్ కవిత్వంపై విశ్లేషణా గ్రంథం

Essay
యాకూబ్ కవిత్వంపై సౌభాగ్య రచించిన వ్యాసాల సంపుటి "బహుత్ ఖూబ్ యాకూబ్' ఆవిష్కరణ డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ ఆవిష్కరణ సభ జరుగుతుంది. ప్రముఖ కవి కె. శివా రెడ్డి పుస్తకాన్ని అవిష్కరిస్తారు. ప్రముఖ కవి దేవీప్రియ ఆవిష్కరణ సభకు అధ్యక్షత వహిస్తారు. ప్రముఖ తెలంగాణ వాగ్గేయకారుడు గోరటి వెంకన్న ఆత్మీయ అతిథిగా సభకు విచ్చేస్తారు. జనార్దన మహర్షి కృతిస్వీకర్తగా సభలో పాల్గొంటారు.

సాహిత్యకారులు హెచ్చార్కె, ఎకె ప్రభాకర్ పుస్తకంపై విశ్లేషణ అందిస్తారు. పాలపిట్ట సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. యాకూబ్ గత మూడు దశాబ్దాలుగా రాసిన కవిత్వంపై సౌభాగ్య విశ్లేషణ ఈ పుస్తకంలో ఉంది. మైనారిటీ సామాజిక వర్గం నుంచి వచ్చిన యాకూబ్ తన కవిత్వంలో మానవతావాదాన్ని కేంద్రంగా చేసుకుని తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేస్తూ వచ్చారు. ఆయన కవిత్వంలో మైనారిటీ అంశ మానవ సహజ స్పందనలను ఆవిష్కరిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+