గెలుపు దారి సూరీడు

వాడు దోపిడీ సమాజానికి, రాజ్యానికీ వ్యతిరేకంగా దండు గట్టిన సాహసికుడు. పులి గుహలోకి వెళ్లి సాహసించిన వాడే పులి పిల్లను పట్టి తెస్తాడన్నాడు. వెయ్యి కత్తివేట్లకు జంకనివాడే రాజుని పదవీ భ్రష్టుణ్ని చేస్తాడన్నాడు. నేను శ్రీకాకుళాన్ని. నేను విప్లవాన్ని. నేను ప్రజల పూపిరిని అన్నాడు. పాటల్లినా, తూటా పేల్చినా ప్రజా విప్లవం కోసమేన్నాడు. వాడు కవిత్వం కోసం కవిత్వం రాయలా. ప్రజల రాజ్యం కోసం చేసే సమరం కోసమే.
ఒరేయ్! కవీ! రవీ! శివసాగరూ! సత్యమూర్తీ! కవిత్వమంటే సమాజాన్ని చదవడం అన్నావు. ఓ మంచి సమాజం కోసం ప్రజల నుంచి ప్రజల కోసం ఆదివాసీ గుండెల్లో .... ఆదిలాబాద్ గోండుల్లో లంబాడీతండాల్లో ఖమ్మం కోయగూడెంలో .... మాలమాదిగ పల్లెల్లో... తెలంగాణ ఊరుల్లో... గోదారి జాలర్లలో ... శ్రీకాకుళం దారుల్లో పాటనెతికి పట్టుకున్నావు. ఆకలి పాటని అడవి అందాలతో ప్రజాపాటగా ఎగరేసావు. నరుడో! భాస్కరుడిలా. తోటరాముడి తూటాలా. చెల్లీ! చంద్రమ్మలా! ఏటికి ఎదురీదువాళ్లంలా!
కవిత్వమంటే ఒక వేదన... అన్వేషణ.. ఓ సాధనగానే. చెక్కిన కవిత్వాన్ని అల్లుకుపోయిన పాటల్ని... విప్పపూల చెట్ల సిగను... దాచిన విల్లంబులన్నీ నీకిస్తా తమ్ముడా! నికిస్తా తమ్ముడా అన్నట్టే, పంచిపోయావు. కవిత్వంలో ఎన్ని చెట్లు నాటావు. ఎన్ని పూలు పూయించేవు. అడవంతా విప్లవ జడివానలో తడిపించి. ఎన్నెన్ని పిట్టలు. ఎన్న పాటలో. అన్నింటినీ నెత్తురొలికే పాటలే పాడమన్నావు. నువ్వు నిజంగానే అడవిలో కురిసిన వెన్నలవురా. రాలిపడిన పూవులకై, గాయపడిన పిట్టలకై ప్రాణాలివ్వనేర్పిన ప్రకృతి పోయిట్‌విరా. అందుకేనేమో తోట రాముడు లేని మైనా మతలబు చేసెరా. కంజు కన్నీరెట్టెర ఓ విలుకాడా! నెమలి నాట్యము మానెరా. జింకాలేడీ కుమిలి కుమిలి ఏడ్చాయిరా! సందెకాడ సూరీడా, చందమామ సూరీడా.
ప్రజా కవీ! అలగాజనం అలల కవీ! శివసాగరా!
మహాకవి శ్రీశ్రీ.. యుగకవి శ్రీశ్రీ తర్వాతే. శివసాగరని నొక్కి మరీ చెబుతున్నార్రా కొందరు. మహాకవి పుస్తకాల్లోనే. మరి శివసాగరో? ప్రజల్లో సజీవంగా. శ్రీశ్రీ కవిత్వం ఫాసిస్టు శక్తులకి వ్యతిరేకంగా... ప్రగతిశీల అగ్రకుల మధ్యతరగతి రంగాలకి ప్రాతినిధ్యం వహిస్తూ. హరోం హర. హరహర జగన్నాథ రథ చక్రాలు, రథచక్రాలంటూ. మరో ప్రపంచం కోసం మరో ప్రపంచం అంటూ. నెహ్రూలో సోషలిజాన్ని చూస్తూ. మహాకవిలో ఎన్ని వైరుధ్యాలో... యుగ కవిలో కాలంతో వచ్చిన ఎన్ని పరిమితులో. యుగకవికి ఏకలవ్య సివి ప్రేమ లేఖ. కవీ నీకేమైందని. నువ్వయితే సరిగ్గానే చెప్ావు - సోషలిజం వేషంలో, జాతి జనుల మోసగించి... విషపునాగు భావాలకు నాగస్వరం వూదకు. నీవూహించిన ఉగ్రవాది, నీలో గల నెహ్రూవాది, నావాడా! శ్రీశ్రీ అని. నెహ్రూ సోషలిజం మీద భ్రమలు వీడి వ్యవసాయ కూలీల నక్సల్బరీలోంచి నువ్వు. ఈ చెట్లకు బుల్లెట్లెందుకు పూయవూ అని కవితా ఢాంబికం కోసం గాక, నిజంగానే అడవికి విప్లవ పువ్వులు పూయించేవు. అడవని కాసిన సూరీడిలా అధర్మ రాజ్యం మీదికి వదిలిన బుల్లెట్లలా. కొత్త ప్రపంచ నిర్మాణంలో. ప్రజల భాషలో. ప్రజల బాణీల్లో. ఉద్యమాన్నీ కవిత్వాన్నీ కలబోసుకుని. విప్లవం కోసం. పేదవాళ్లం పెట్టుబడి లేకుండా రెడు పనులూ చెయ్యగలం. కలం పట్టి కవితలల్లగలం. ప్రాణాలిచ్చి పోరాటం చెయ్యగలం అన్నావు. అదోలోకానికి పోతున్న సమాజ విమానాన్ని హైజాక్ చేసినవాడికి. ఖడ్గాన్ని మీటి ప్రచండ జనసంగీతాన్ని సృష్టించిన వాడికి అట్టాగే, చెప్పులు పారేసుకుని, నెత్తుటి మడుగు దాటుతున్న కాలానికి, కత్తి, ఆరె తీసుకొని కన్నీళ్లతో చెప్పులు కుట్టిన కవికి... ఏ కిరీటాలూ, భుజకీర్తులూ, గానాబజంత్రీలూ అవసరం లేదు గాక లేదు. వాడు ప్రజల్లో కలిసిపోయిన కవితా సంగీతం. అందుకే రాజ్యం కన్నెర్ర జేసి తోటరాముడి పాట పాడవే అంటూ పైశాచికంగా వూగిపోతూ ప్రజాగాయకిపైకి. అసలైన కవిత్వమంటే ఇదేరా, ఇట్టాలేగే ఉండాలి, అచ్చం నీలాగే.
నువ్వు ప్రత్యామ్నాయ ప్రజా ఉద్యమాలకీ కవిత్వానికీ డైరెక్షన్‌వి. ప్రజల డిక్షనరీవి కూడా. మన చదువుల్లో, పుస్తకాల్లో, సాహిత్యాల్లో లేని ప్రజా పదాలు సజీవంగా నీ పాటల్లో మాటల్లో. వరికిళ్లు, నత్తగుల్ల గజ్జెలు, చిర్రా చిటికెన పుల్ల, మిగ్ పాప, చద్దిమూట, ఎద్దుకూర, పరిగె, పైడికంఠి, కంజు పిట్ట, కాడుబర్రె.. ఇట్టా ఎన్ని పదాలో. నీ కవిత్వంలో ముస్తాబు చేసి. బ్రాహ్మణీయ భాషకి, ఆధిపత్య ప్రతీలకి ప్రత్యామ్నాయంగా... నువ్వో కౌంటర్ మైథాలజీవి. ఏకలవ్యుడు, శంభూకుడు, ఛండాలుడు అభిమాన హీరోలుగా, రాముడోడు, మనువోడు, శంకరస్వామిల మీద తిరుగుబాటుగా, చరిత్రలో అవమానీయబడిన జీవితాలు నిండైన ఆత్మగౌరవంతో నిలబడి.
1968. ఫ్రెంచ్ యూనివర్శిటీల గోడల మీద రాసిన నినాదంలా. రివెల్యూషన్ ఇన్ పొలిటిక్స్, ఫ్యామిలీ అండ్ లవ్. అన్ని రంగాల్లోనూ విప్లవం. పబ్లిక్... ప్రైవేట్ లైఫులోనూ. రాజకీయాల్లోనూ, సాహిత్యంలోనూ, జీవితంలోనూ. విప్లవం - జీవితం - కవిత్వం - ప్రేమ మధ్య గీతలు చెరిపేసి, అమ్మా! నన్ను కన్నందుకు విప్లవాభినందనాలన్నావు. జీవితం మనల్ని ప్రేమించిన చోట, జీవితం పేరిట మనం విజయాల్ని సాధించిన చోట మణెమ్మని చూశానన్నావు. పార్వతీ! లవ్ మీ, వితవుట్ లవ్ అని వేడుకున్నా... గుండె నిండా ఆర్ద్రతతో.
శ్రీకాకుళం నుండి జగిత్యాల. జగిత్యాల నుండి చుండూరు. విప్లవోద్యమం నుండి దళితోద్యమంలోకి. దళితోద్యమం సెకండ్ ఇన్నింగ్స్. రెంటిలోనూ హీరోగానే. నాట్ అవుట్ బాట్స్‌మన్ లానే. రెండు ఉద్యమాల్ని ఎంతగా ప్రేమించావో. అందులోని అంతర్గత సంక్షోభాల్ని అంతే తేలిగ్గా పసికట్టావు. పాట జాగ్రత్త! బాట జాగ్రత్త! నడక జాగ్రత్త! నడత జాగ్రత్త! కడలి జాగ్రత్త! కనుచూపు జాగ్రత్త! జాగ్రత్త. కామ్రేడ్...! అన్నావు. వర్గకుల పునాదిపై శక్తిమంతమైన వ్యూహరచన చేయడం విప్లవ కర్తవ్యంగా. అంబేడ్కర్ తాత్విక సామాజిక విశ్లేషణల్ని విప్లవోద్యమాలకి అన్వయించుకోవాల్సిన అవసరాన్ని చెబుతూ. అంబేడ్కర్ పీడిత వర్గాల కోసం పోరాడాని ఛాంపియన్ అంటూ. విప్లవం ప్రజాస్వామిక పునాదులపైన, ప్రజాస్వామిక శక్తులను సంఘటితం చేస్తూ. ఆధిపత్య వర్గాలు, కులాలకి వ్యతిరేకంగా. దళిత ఉద్యమం బలమైన చారిత్రక, తాత్విక, సామాజిక, రాజకీయ పునాదుల మీద నిలబెట్టాలనుకున్నావు. అంబేడ్కర్‌ని ఆరాధనగా కాక, అంబేడ్కర్ ఆలోచనల్ని ఆచరణాత్మకంగా. అంబేడ్కర్ సూరీడులా. ఆత్మగౌరవం నుంచి ఆత్మరక్షణ - ప్రతిఘటన దిశగా. అంటరానివాడు ఒక మనిషిగా నిలబడే వరకు మంచీచెడు, పొగడ్తలూ శాపనార్థాలు, గౌరవఅగౌరవాలకి అతీతంగా తుఫానులకు ఎదురొడ్డి నిలబడ్డవాడే ధన్యజీవి అన్న అంబేడ్కర్‌లానే. అవిశ్రాంత పోరాటమే దళిత విముక్తికి ఏకైక మార్గం. లేదు మరో మార్గం. అది నేట సామాజిక అవసరం అన్న అంటరాని వసంతంలా. సామాజిక విప్లవ వేదికగా. బహుజన రాజ్యాధికారం కోసం పోరాటంలా. సమతా వాలంటరీ ఫోర్సుగా. ఏకలవ్యుడిలా, ఎదురీతగా, ప్రజాప్రతిఘటనగా... అలుపెరుగని పయనం. కొత్త కలలకు ప్రాణం పోస్తూ. కలలతో పాటు కదలని ప్రపంచాన్ని చూస్తూ. ఆశానిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ. అయినా మడమ తిప్పకుండా ముందుకు సాగిపోతూ... వెళ్లిపోయావా సమరయోధుడా! గెలుపు దారి సూరీడిలా.
ఓహో! నేటి కాలం దార్శనికుడా! రాజనీతిజ్ఞడా! మార్క్సీయుడా! అంబేడ్కరీయుడా! అంటరానివాడా! చరిత్ర మరణించిందన్నావు. మట్టి కాళ్ల మహారాక్షసిని మన్ను కరపించాలన్నావు. జైళ్లు లేని ప్రపంచాన్ని చూడాలనుకున్నావు. వివిలా శాంటియాగో. సద్దాంకు ప్రేమలేఖ. అల్లాహో అక్బర్!... అమెరికా సామ్రాజ్యవాదీ ఖబడ్దార్ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ. జానపదుడిగానే గాదు, అంతర్జాతీయ శాంతి గీతంలా కూడా.
సత్యయోధుడా! విప్లవకారుడా! కళాసాగరుడా! ఆకు సెప్పుల సూరీడా! విప్లవోద్యమానికీ - దళిత ఉద్యమానికి, ఉద్యమానికీ - సాహిత్యానికీ, ఆటకీ - పాటకి, పాటకీ - కవిత్వానికీ, మౌఖిక సాహిత్యానికీ - రాత సాహిత్యానికీ, జానపదానికీ - ఆధునికతలకీ, గాయానికీ - గేయానికీ, పల్లెకి - ప్రపంచానికీ, నిన్నటికీ - రేపటికీ, సూర్యుడికి - చందమామకీ వారధివి. రథసారథివి. నీ జ్ఞాపకాలనేకం. జీవితం ఒక్కటే. ఒక్కటే కల. మట్టి మనిషి తలెత్తుకుని బతికేలా.
- డాక్టర్ పి. కేశవకుమార్
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications