ఫొటోలు: కవితా సంరంభం
కరీంనగర్: తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత సాహిత్య ఉద్యమాలు ఉధృతమయ్యాయి. నిజానికి రాజకీయ ఉద్యమాల కన్నా ముందే తెలంగాణ సాహిత్య ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తెలంగాణ కవులు రచయితలు, కవులు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమ సాహిత్య సృజనకు సామూహిక రూపం ఇస్తున్నారు.
తెలంగాణ కవితా సంకలనాలు ఇప్పటికే వెలువడ్డాయి. వార్షిక కవితా సంకలనాలు కూడా వస్తున్నాయి. జిల్లాలవారీ కవితా సంకలనాలు వస్తున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా కవులు 2012 కవితా సంకలనం వెలువరించారు. కరీంనగర్ కవిత - 2012 పేరిట వెలుడిన ఈ కవితా సంకలనంలో 85 మంది కవితలున్నాయి. ఈ కవితా సంకలనాన్ని ప్రముఖ రచయిత, న్యాయమూర్తి జింబో అలియాస్ మంగారి రాజేందర్ ఆదివారంనాడు కరీంనగర్‌లో ఆవిష్కరించారు.
సాహితీ సోపతి నిర్వాహకుడు, ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ సభకు అధ్యక్షత వహించారు. కవి కూకట్ల తిరుపతి పుస్తకాన్ని సమీక్షించారు. తెలంగాణ పల్లే భాషను బ్రతికించే ప్రయత్నం కవులు చేస్తున్నారని జింబో అన్నారు. పుస్తకంలోని 85 కవితలు మనసును కదలించాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావుతో సహా గాజోజు నాగభూషణం, బూర్ల వెంకటేశ్వర్లు, సంగనభట్ల నర్సయ్య, బండారి అంకయ్య, డింగరి ఆచార్య, అన్నవరం శ్రీనివాస్, నలిమెల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ జిల్లా వార్షిక కవితా సంకలనాన్ని ఆవిష్కరించిన ప్రముఖ రచయిత, న్యాయవాది మంగారి రాజేందర్ (జింబో). చరిత్రకారులే కాకుండా కవులు, రచయితలు కూడా చరిత్ర సృష్టిస్తున్నారని ఆయన అన్నారు.

ప్రముఖ రచయిత నలిమెల భాస్కర్ జింబో నుంచి కవితా సంకలనాన్ని అందుకుంటున్నారు. పక్కన అన్నవరం దేవేందర్‌ను చూడవచ్చు.

వేదిక మీదికి వచ్చి కరీంనగర్ జిల్లా కవులు తమను తాము పరిచయం చేసుకున్నారు.

జింబో నుంచి కవితాసంకలనం అందుకుంటున్న కరీంనగర్ జిల్లా కవి..

జింబో నుంచి కవితాసంకలనం అందుకుంటున్న కరీంనగర్ జిల్లా కవి..

జింబో నుంచి కవితాసంకలనం అందుకుంటూ మరో కవి ఇలా...

జింబో, అన్నవరం దేవేందర్‌లతో ప్రముఖ కవి కందుకూరి అంజయ్య.

సమావేశంలో మాట్లాడుతున్న నారాయణ శర్మ

సభా వేదిక మీద కవితా సంకలనం అందుకుంటూ ఇలా..
(గమనిక: సాహిత్య సమావేశాలకు, సాహిత్య వ్యాసాలకు, సమీక్షలకు, కవితలకు స్వాగతం పలుకుతున్నాం. మీ రచనలను, సంబంధిత ఫొటోలను ఈ మెయిల్‌కు పంపించగలరు. [email protected])
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications