వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనంపాటి భాస్కర్ కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

Mynapti Bhaskar
హైదరాబాద్: ప్రముఖ రచయిత మైనంపాటి భాస్కర్ (68) మంగళవారం కన్నుమూశారు. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. భాస్కర్‌కు భార్య, కూతురు ఉన్నారు. ఆయన రచించిన నవలలు, కథలు దేశ, విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించాయి. దాదాపు 30 నవలలు, 100కిపైగా కథలు రచించారు.

ఆయన రచనల్లో ఎక్కువ సైన్స్ ధృక్ఫథం (ఫిక్షన్)తో ఉన్నా యి. 1994లో ఆయన రచించిన బుద్ధిజీవి అనే నవల ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఆయన నవలల్లో బివేర్ ఆఫ్ గాడ్స్ అనే కథ పలు భాషల్లో ప్రచురించబడింది. వెనె్నలమెట్లు నవల ఆధారంగా ‘అరుణకిరణం' సినిమా తీశారు. మై నంపాటి రచించిన సైన్స్ ఫిక్షన్ నవలలు కొన్ని వా షింగ్టన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్‌లో భద్రపరిచారు.

సినిమా సమీక్షలను కూడా రాసి ఆ రంగం వారి ఆదరాభిమానాలను పొందారు. కొంత కాలం ప్రభుత్వ ఉద్యోగం చేసిన మైనంపాటి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఆ మిగిలిన సమయాన్ని రచనలు కోసం వినియోగించారు.

ఆయన హైదరాబాదులోని యూసుఫ్‌గుడాలో నివాసం ఉంటూ వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరిగాయి. మైనంపాటి భాస్కర్ స్వస్థలం ప్రకాశం జిల్లా మైనంపాడు. తన బుద్ధిజీవి నవలను కాపీ కొట్టి శంకర్ రోబో సినిమా తీశారని ఆయన ఆ మధ్య కాలంలో ఆరోపించారు.

English summary
Renowned Telugu writer Mynampati Bhaskar died at a city hospital here on Tuesday.Bhaskar, who is literary figure with many publications to his credit, died while undergoing treatment at a corporate hospital in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X