ఇంటిలో ' ఇంటి దీపం ' ఆవిష్కరణ: ఫేస్ బుక్ లైవ్
కవి అన్నవరం దేవేందర్ పదవ కవితా సంపుటి ' ఇంటి దీపం 'ను కరీంనగర్ లోని తన ఇంటిలో నవంబర్ 24 న నిరాడంబరంగా విడుదల చేశారు .
కవి అన్నవరం దేవేందర్ పదవ కవితా సంపుటి ' ఇంటి దీపం 'ను కరీంనగర్ లోని తన ఇంటిలో నవంబర్ 24 న నిరాడంబరంగా విడుదల చేశారు . సాహితీ సోపతి ప్రచురించిన పుస్తకాన్ని ఆయన పదిమంది సాహితీ మిత్రులచే వినూత్నంగా ఆవిష్కరింప చేసారు.

మొదట అన్నవరం సహచరి ఏదునూరి రాజేశ్వరి దీపం ముట్టిచ్చి సమావేశం ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత నలిమెల భాస్కర్ ,తెలంగాణా జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ ,రిటైర్డ్ డిప్యూటి కలెక్టర్ కవి బండారి అంకయ్య ,ప్రముఖ న్యాయవాది రచయిత గిలబీల మల్లారెడ్డి తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజోజు నాగభూషణం పాల్గొన్నారు.ప్ర

వారితో పాటు ముఖ చిత్రకారుడు అన్నవరం శ్రీనివాస్ ,కవులు బూర్ల వెంకటేశ్వర్లు కూకట్ల తిరుపతి,వడ్నాల కిషన్ ,సి .వి. కుమార్ ,విలసగరం రవీందర్ ,ప్రేమసాగర్ రావ్ ,అన్నవరం గవుతం,మణిమాల ,రాజమల్లు ,అక్షిత లు పాల్గొన్నారు.
సాదాసీదా గ జరిగిన మొత్తం కార్యక్రమం ఫేస్ బుక్ లో లైవ్ ప్రసారం కావడం విశేషం .ఈ సమయంలో దాదాపు వెయ్యి మంది వీక్షించినట్లు సి .వి కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications