భరత్ కృష్ణ ఆంగ్ల నవల నేడే విడుదల

హైదరాబాద్‌: తెలుగు సమాజానికి చెందిన భరత్ కృష్ణ ఆంగ్ల నవల గయ్ ఆన్ ద సైడ్‌వాక్ అనే నవల గురువారం రాత్రి విడుదల కానుంది. గురువారం రాత్రి 8 గంటలకు ఈ నవల ఆన్‌లైన్‌లో విడుదలవుతుంది. గూగుల్ ప్లస్, యూట్యూబ్ లైవ్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ నవలను విడుదల చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన భరత్ కృష్ణ రచనను తన అభిరుచిగా మలుచుకున్నారు. గురువారం రచయితతో లైవ్ ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. సోషల్ మీడియాలో, బ్లాగ్‌లో రచనలను చేయడం ఆయన అలవాటుగామార్చుకున్నారు.

Bharath Krihsna's English novel "Guy On The Sidewalk"

గయ్ ఆన్ ద సైడ్‌వాక్ అనేది ఆయన తొలి నవల. వ్యవసాయ శాస్త్రంలో ఆయన డిగ్రీ చేశారు. మేనేజ్‌మెంట్ డబుల్ మాస్టర్ డిగ్రీ చేసారు. భారతదేశంలోనే కాకుండా అమెరికాలో ఆయన మార్కెటింగ్, బోధన, ఐటి రంగాల్లో పనిచేశారు.

భారత యువతను ఉద్దేశించి రాసిన నవల గయ్ ఆన్ ద సైడ్ వాక్. ఎన్నారైల జీవితం, భారత్‌కు తిరుగుముఖ, మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులు, దేశం పట్లా తల్లిదండ్రుల పట్లా నిర్వర్తించాల్సిన బాధ్యత వంటి విషయాలు నవలలో చూడవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+