కవి జానుమద్ది కన్నుమూత

ప్రజల సందర్శనార్థం జానమద్ది భౌతికకాయాన్ని బ్రౌన్ గ్రంథాలయంలో ఉంచారు. శుక్రవారం సాయంత్రం జానమద్ది భౌతికకాయానికి కడపలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాశారు. 16 గ్రంథాలు వెలువరించారు.
జానుమద్ది హనుమచ్ఛాస్త్రి 1926 సెప్టంబర్‌లో అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు. 1946లో బళ్లారిలోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. మా సీమ కవులు, నాట్యకళా ప్రపూర్ణ బళ్లారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి కన్న సాహిత్య సౌరభం -2, కడప సంస్కృతి - దర్శనీయ స్థలాలు, సిపి బ్రౌన్ చరిత్ర వంటి పలు గ్రంథాలను ఆయన రచించారు.
కడపలో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడ్డారు. రాష్ట్రంలోని వివిధ తెలుగు సాహిత్య కవులు, రాజకీయ నాయకులు జానముద్ది మరణానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జానముద్ది హనుమాశ్చాస్త్రి మృతికి సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications