కన్నీటి నుంచి రాలిన ఓ అక్షరం
అనువాదం (translation ) అన్నది అంత సులువైన ప్రక్రియ ఏమి కాదు . మూల భాష లో ని అర్థాన్ని, భావాన్ని చెడకుండా తత్సమానంగా సరి పోలి వుండే ప్రతీకలతో, పోలికల్తో చెప్పాల్సి ఉంటుంది ...అలా చెయ్యాలి అంటే ముందుగా కవికి రెండు భాషలలోను ప్రావిణ్యం ఉండి తీరాలి.
మూల భాషలో ని భావం అర్థం అయితే నే గాని అనువాదం పరిపుష్టంగా రాదూ .. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే ...ఇపుడు చెప్పుకోబోయే ఓ మంచి పుస్తకం గురించి ..1920 కాలం నాటి ఓ హింది కవి రాసిన కావ్యానికి అనువాదమే ఈ పుస్తకం. ""ఆంస్సూ " అనే ఈ పుస్తకానికి హింది మూలం రాసిన వారు జయశంకర్ ప్రసాద్ . మరి దీన్ని అనుసృజన చేసిన వారు జలజం సత్యనారాయణ గారు ...
"ఆంస్సూ " ని తెలుగులో "వేదన " గా అనువదించారు. అంటే హిందీలో "కన్నీరు " అని అర్థం ...ఎవరి కన్నీరు ..రచయిత తన జీవితం లో ఎదుర్కొన్న విషాదాన్ని మర్చిపోవడానికే కన్నీరు రూపంలో అక్షరాన్ని ఆశ్రయించారా, ఏమో .. చాల చోట్ల తాత్వికత ..వైరాగ్యం ...మరణం లాంటివి కనిపిస్తాయి ..
మరి రచన కాలం ఎప్పటిది మూల రచన కాలం 1923-24, మూల రచన ప్రచురణ ఏమో 1925. తెలుగు అనువాదం ప్రచురణ ఎప్పటిది అంటే.... 1965లో అనువాదం చేస్తే, ప్రచురణ ఏమో 2015 సవత్సరం లో జరిగింది .
కాల్పనిక వాదం (Romanticism ) తీవ్రంగా ఉన్న రొజుల్లొ రాయబడినది. భావ కవిత్వంలో అద్బుతమైన రచన. ఈ కావ్యం మొత్తం కూడా నాలుగు పాదాల పద్య రచనతో కొనసాగుతుంది. వేదన కావ్యం అంతా ప్రేయసీప్రియుల ప్రేమ వియోగాల సమస్య తో ప్రారంభం అయి అనేక మలుపులు తిరుగుతుంది ..ఈ మలుపులు ఎక్కువ గా మానసికం గా వుంటాయి ..

యాబై ఆరు గేయంలో కీల క వర్ణన చూడండి ఎంత బాగుంటుందో ..
"శ్రమ బిందువులు తారలై
తడిసినవి గగన వస్త్రం " ఈ శ్రమ బిందువులు రతి సుఖ ఫలితంగా కలిగినవే అయితే కవికి ప్రేయసికి మధ్యన వున్నది కేవలం భావుక సంబంధమో, అమలిన శృంగార బందమో కాదు ..ఆ తరువాత గేయ లో
"నా సమాగమ నికుంజంలో
అలసిన వెన్నల నిదురించునా
కంటి రెప్పల కళల తడిసే
జీవితమ్మే కరుగగా " అని అంటాడు ..ఎంత చక్కని వర్ణన ...
ప్రేయసి జ్ఞాపకాన్ని తన జీవితానికి అర్థం పరమార్ధమే....ప్రేమ నుంచి విడిపోయాక మిగిలేవి ప్రేయసి జ్ఞాపకాలే కదా...అదే తను చేసిన తప్పు ని జీవన పంకలన్ని కడిగి వేస్తుంది అంటాడు (170) లో
"నీ మధుర జ్ఞాపకాలే
నా జీవితానికి అర్థం పరమార్థం
ఈ చిన్ని చిన్ని కన్నీటి బిందువులే
నా జీవన పంకిలాన్ని కడిగి వేయును " నిజమే ప్రేమ మనల్ని దాటుకుంటూ వెళ్ళాక జ్ఞాపకాలే మిగేలివి .
మరి మనల్ని వదిలి వెళ్ళిన తరువాత ఏమిటి మిగేలివి కన్నేల్లె .. విరహ వేదననే పదునాలుగు భువనాలు వెతికినా కూడా అవి మల్లి వెనక్కు వస్తాయి ..ఇదే అంటారు ..120 పద్యం లో ...వేదన అశ్రువులు మనలను దాటుకుంటూ ఎపుడు వెళ్ళవు ..
"పదునాలుగు భువనాలు వెదుకగా
అశ్రువులే కనిపించేనేమో ! ?
విశ్రాంతి లేదని జీవితానికి
వికల వేదన తిరిగి వచ్చెను "
తను కోల్పోయిన ప్రేయసిని తలచుకుంటూ ఎన్ని లోకాలు తిరిగినా చివరికి నిరాశనే మిగిలించిది ...విశ్రాంతి లేని జీవితానికి వికల వేదనలే.
ఇలాగే విరహాన్ని తలచుకుంటూ తోటి వాడు బాధల్లో వుంటే పట్టించుకోని నిర్లిప్తాన్ని , మనస్తత్వాన్ని కూడా ప్రశ్నించారు .. మూలం లో ఉన్నది ఉన్నట్టు గా అర్థం చెడకుండా అనువదించారు .. సుఖ దుఖాల అలల మధ్య మునిగి తేలే మానవుడికి తోటి వాడి గురించిన తపన లేదు అని బాధ ని వ్యక్తం చేస్తారు .
"సుఖ దుఖాల అలల మధ్య
మునిగి తేలె మానవునికి
తోటి వారి మంచి చెడ్డల
తిరిగి చూచే కాలమేది" మరి అంతే కదా ..మనం బాగుంటే చాలు, వేరే వాళ్ళ సంగతి మనకి ఎందుకు అనుకునే రోజులు ఇవి స్వార్ధం మద్య జీవిస్తున్న వారికి సహాయం విలువ ఏమి తెలుస్తుంది ..
తన జీవితం మోడు వారి ...చివరి దశకు వచ్చినప్పుడు ..ఇకా జీవితం అంతా ప్రేమ రహితం గా మారిపోయింది అని బాధ పడ్డప్పుడు ఎర్రటి ఎండల్లో కురిసిన వాన చినుకు లా ఆమె వస్తే ...ఇక ఎంత బాగుంటుంది అప్పుడు వసంతమే కదా..
"బీడు పడిన ఎద లోపల
శిషర మొదులు నిల్చినపుడు
కుసుమ పరాగాలు చల్లుతూ
వసంత లక్ష్మీ గా చేరితివి నను " సూపర్బ్ గా వర్ణించారు ..అంతే మరి బీడు పడిన ఎదలో ప్రేమ ఫల సాయానికి వచ్చిన వసంతం ఆమె.
భావ కవిత్వం లో విరహం లో వేదనా ప్రియత్వం ఒక బలమైన లక్షణం. కొద్ది కాలం తరువాత విరహ ప్రియత్వానికి తాత్విక కోణం జోడించబడింది.
"సృష్టి ప్రశాంతి సంధ్య లో
సంయోగ వియోగాలేకమగాను "
అంటున్నాడు ...
ఈ వేదన ముగింపు గీతం లో ఆశాభావాన్ని వ్యక్తం చేసారు .. మనోవేదన ను అక్షరీకరించిన కవి చివరకి ఉదయపు మంచు బిందువులు లోకం మీద కురిసి అంద్నాన్ని కలిగించినట్టు గా, మోడు బారిన విషాద జీవితం మీద కరుణాశ్రువులు కురిపించి సుఖాన్ని కలుగ జేయాలని కోరుకుంటున్నాడు ..ఎంత బాగుంటుందో కదా...
"సకల సుఖ సారముల సేకరించి
మోడు బారిన జీవితాలపై
కరుణాశ్రువు ప్రభాత తుశారమై
ఈ విశ్వంభర పై "
జయశంకర్ ప్రసాద్ జీవితంలో గొప్ప విషాదం వుంది ఇద్దరు భార్యల్లు , ఒక కుమారుడు మరిణించిన విషాదాన్ని తలకెత్తుకున్నప్పుడు సాహిత్య ప్రపంచమే అతనికి ఉరటనిచ్చింది . దాని ఫలితమే "ఆంస్సూ " . ఈ ఆంస్సూ " కల్పిత కావ్యం. కన్నీరు దాని ఫలితమైన వేదన ఇతివృత్తం గా సాగిన రచన. మలుపు తిరిగిన చోట లీల మాత్రం గా కదా కనిపిస్తుంది కాని కథా ప్రధానం గా కావ్యం సాగదు . ఇది 190 గేయాలు/గీతాలు ఉన్న కావ్యం . 47 సంవత్సరాల స్వల్ప జీవిత వ్యవధి లో కల పరీక్షకు నిలబడగలిగిన సాహిత్యాన్ని మనకు అందించారు .ఈ కావ్యాన్ని జలజం సత్యనారాయణ గారు అనువదించి జయ ప్రసాద్ గారికి నిజమైన నివాళి అందించారు ..అబినందనలు .
-పుష్యమీ సాగర్
9032215609












Click it and Unblock the Notifications