సింహరాశి, కన్యా రాశి మే నెల జాతక ఫలం పూర్తి వివరాలు

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. తెలుగులో ఉన్న 12 రాశుల్లో సింహరాశి, కన్యారాశివారి మే నెల జాతక ఫలం ఎలా ఉందో పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఈ ఫలితాలు గ్రహాల కదలికల ఆధారంగా ఉంటాయి. వ్యక్తిగత జాతకంలోని గ్రహ బలాన్ని బట్టి ఈ ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)

సింహ రాశి వారికి మే నెల అధిక శ్రమతో కూడిన విజయాలను అందిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సిన సమయం ఇది. ధన ప్రవాహం బాగుంటుంది కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. విలాస వస్తువుల కోసం లేదా శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది.కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అయితే పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటించాలి.

Horoscope Predictions and results for these two signs leo and virgo for the month of may

వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం, ముఖ్యంగా ఎండ ప్రభావం వల్ల వచ్చే ఇబ్బందులు లేదా రక్తపోటు వంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి. క్రీడారంగంలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. ఆదివారం పూట ఆదిత్య హృదయం పఠించడం లేదా సూర్య నమస్కారాలు చేయడం వల్ల మానసిక బలం పెరుగుతుంది.

కన్యా రాశి (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు)

కన్యా రాశి వారికి మే నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. షేర్ మార్కెట్ లేదా రిస్క్ ఉన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకపోవడం శ్రేయస్కరం. పొదుపుపై దృష్టి పెట్టండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తోటి ఉద్యోగుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు కానీ మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. వ్యాపారస్తులు భాగస్వామ్య ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చే సూచనలున్నాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది.విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. సోషల్ మీడియా లేదా ఇతర వ్యాపకాల వల్ల సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా గణపతికి గరిక సమర్పించడం వల్ల ఆటంకాలు తొలగుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+