లోకేష్ కవర్ ఫొటో వ్యాసానికి కోటి రిలీజ్?- తేల్చేసిన ఏపీ సర్కార్..!

ఏపీలో విద్యాశాఖమంత్రిగా ఉన్న సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ (Nara Lokesh) తాజాగా ఫార్చూన్ ఇండియా పత్రిక కవర్ పేజ్ పై దర్శనమిచ్చారు. ఆంధ్రాస్ రైజింగ్ స్టార్ అంటూ రాష్ట్రంలో ఆయన తెస్తున్న పెట్టుబడుల వివరాలతో ఫార్చూన్ పత్రిక లోకేష్ ను కీర్తిస్తూ ఈ వ్యాసం ప్రచురించింది. మరోవైపు నెట్ వర్క్ 18 గ్రూప్ కు చెందిన బిజినెస్ ఛానల్ సీఎన్బీసీ టీవీ(CNBC TV)కి కోటీ 15 లక్షల 64 వేలు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఓ జీవో విడుదల చేసింది. ఈ రెండింటినీ కలిపి చూస్తే ప్రభుత్వం ఇచ్చిన నిధులు తీసుకుని లోకేష్ ను ఫార్చూన్ పత్రిక కవర్ పేజ్ కథనం ఇచ్చారనేలా ఉంది.

ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో విపక్ష పార్టీల కార్యకర్తలు, లోకేష్ ప్రత్యర్ధులు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) ఇవాళ ఫ్యాక్ట్ చెక్ (Fact Check) ద్వారా స్పందించింది. ఫార్చ్యూన్ ఇండియా పత్రిక లో మంత్రి శ్రీ నారా లోకేష్ గురించి వ్యాసం రాయించుకోవడానికి కోటి రూపాయలకు పైగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేశారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యం అని ఇందులో తేల్చేసింది.

AP Govt Fact-Checks 1 15 Crore Claim Over Nara Lokesh s Fortune Cover Report

అలాగే ఈ తప్పుడు ప్రచారం లో చూపించిన జీవో 18-1-2025 తేదీన ప్రపంచ ఆర్థిక సదస్సు (World Economic Forum -2025) లో ఆంధ్ర ప్రదేశ్ లో పెట్టుబడి అవకాశాలను ప్రచారం చేసేందుకు ప్రతిష్టాత్మక ఇంగ్లీష్ చానెల్ CNBC TV (Network 18 group) కు చెల్లింపు చేయాలని ఇచ్చిన ప్రభుత్వ ఆదేశాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రెండు సంస్థలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. దురుద్దేశపూర్వకంగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం నేరమని పేర్కొంటూ ఫ్యాక్ట్ చెక్ లో ట్వీట్ చేసింది. ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపైనా, ఈ తప్పుడు పోస్టును సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్న వారిపై నా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+