ముసుగు
నీ ముఖం వెనక ఓ ముఖం
ముసుగు తెరల వెనక నీ సుఖం,
నీ మాట నిజం కాదు-
మసక మబ్బులే...
జలతారు దారాల
ముసుగు తెరల వెనక
నేతి బీరకాయలా నువ్వు...
నీ నవ్వు ...
అది నవ్వు కాదు...
నా కన్నీళ్లను చూసి నీ వెక్కిరింత....
నీ మేలి ముసుగు మెరుపుల్లో
నా కళ్లు పేలిపోయాయి
నీ మాటల తీపిదనం
తేనె ఊటలా...
అలా... అలా...
అది తేనె కాదు...
ముసుగు తెరల వెనక
హాలాహలం....
నీవు చూపించే జాలి,
నా నగ్వత్వాన్ని వెక్కిరిస్తూంది
అది జాలి కాదు...
జలతారు పరదాల వెనక నీవు కక్కుతున్న
రక్కసితనం....
ఎన్నాళ్లు నీవు నా
కన్నీళ్లు తాగుతావు...
నీ ముసుగులు చిరిగి పేలికలై
నా మెదడులో ఊపిరిపోసుకుంటున్న
అగ్ని కణాలకు
ఆహుతి అయిన్నాడు,
నీవెక్కడా...
నీకు చోటెక్కడా....












Click it and Unblock the Notifications